Interesting Facts: కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా.. దానికి అర్థం ఇదే!

|

Apr 16, 2024 | 3:51 PM

ఆడవారైనా.. మగవారైనా ఎప్పుడైనా మీ కాళ్ల వేళ్లను గమనించారా? కొందరికి కాళ్ల వేళ్లు సమానంగా ఉంటే.. మరికొందరికి మొదటి రెండు లేదా మూడు సమానంగా ఉంటాయి.. చివరివి చిన్నగా ఉంటాయి. కానీ బొటని వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉంటే.. అందరి మీదా పెత్తనం చెలాయిస్తారని, స్త్రీలు.. భర్త నోరును తెరవనివ్వరని, పెద్ద గయ్యాళి అని, అలాగే మగవాళ్ల కూడా భార్యపై పెత్తనం చేస్తాడని అంటూ ఉంటారు. ఇంతకీ మరి ఇది నిజమేనా? దీనిపై జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారో..

Interesting Facts: కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా.. దానికి అర్థం ఇదే!
Interesting Facts
Follow us on

ఆడవారైనా.. మగవారైనా ఎప్పుడైనా మీ కాళ్ల వేళ్లను గమనించారా? కొందరికి కాళ్ల వేళ్లు సమానంగా ఉంటే.. మరికొందరికి మొదటి రెండు లేదా మూడు సమానంగా ఉంటాయి.. చివరివి చిన్నగా ఉంటాయి. కానీ బొటని వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉంటే.. అందరి మీదా పెత్తనం చెలాయిస్తారని, స్త్రీలు.. భర్త నోరును తెరవనివ్వరని, పెద్ద గయ్యాళి అని, అలాగే మగవాళ్ల కూడా భార్యపై పెత్తనం చేస్తాడని అంటూ ఉంటారు. ఇంతకీ మరి ఇది నిజమేనా? దీనిపై జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి పాదాల ఆకారం చూసి మీరు ఎలా ఉంటారో చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. మీ వ్యక్తిత్వ లక్షణాలతో.. పాదాల ఆకారానికి దగ్గర సంబంధం ఉంటుందట.

అన్ని వేళ్లూ సమానంగా..

మీ కాలి వేళ్లు అన్నీ సమానంగా ఉంటే.. మీరు చాలా నమ్మకమైన వ్యక్తి అని అర్థం. మీకు ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పొచ్చు. అలాగే జీవితంలో కష్టపడే వ్యక్తి అని కూడా అర్థం. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.

మొదటి మూడు వేళ్లు సమానంగా ఉంటే..

కాలి వేళ్లల్లో మొదటి మూడు వేళ్లు సమానంగా ఉండి.. మిగిలిన రెండు మాత్రం చిన్నగా ఉంటే.. మీదీ రోమన్ పాదం అని అంటారు. ఇలాంటి ఆకారం ఉన్నవాళ్లు అందరితోనూ స్నేహంగా ఉంటారు. ఇతరుల పట్ల దయతో ఉంటారు. త్వరగా అందరితో కమ్యూనికేషన్ అయిపోతారు. అలాగే లైఫ్‌లో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు.

ఇవి కూడా చదవండి

కాలి బొటన వేలు పొడుగ్గా ఉంటే..

కాలి బొటన వేలు మాత్రం పొడుగ్గా ఉండి.. మిగిలిన వేళ్లు చిన్నగా ఉంటే.. మీది.. ఈజిప్షియన్ ఫుట్ అని అంటారు. మీరు స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు. మొండిగా ఉంటూ.. మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారు. అలాగే నమ్మకమైన వ్యక్తులు.

బొటన వేలి కంటే పక్కన వేలు పొడుగ్గా ఉంటే..

ఇక చివరిగా.. బొటన వేలి కంటే పక్కన వేలు పొడుగ్గా ఉంటే.. మీది గ్రీకు పాదం అని అర్థం. ఈ పాదం ఆకారం ఉన్నవారు.. చాలా ఎమోషనల్ పర్సన్. అందరికీ త్వరగా కనెక్ట్ అయిపోతారు. అందరితో స్నేహంగా ఉంటారు. చాలా శక్తివంతంగా, సృజనాత్మకంగా ఉంటారు. జీవితంలో గొప్ప స్థానానికి చేరుకుంటారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..