మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య నిద్రపోతే ఏమవుతుంది..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..?

నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి ముఖ్యం. పగటిపూట, ముఖ్యంగా మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల కలిగే శుభ, అశుభ ఫలితాలపై జ్యోతిష్య నిపుణులు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లలు, బాలింతలకు మినహాయింపులున్నప్పటికీ.. కొంతమంది మాత్రం మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు. శాస్త్రం ఏం చెబుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య నిద్రపోతే ఏమవుతుంది..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..?
Daytime Sleeping Rules

Updated on: Dec 25, 2025 | 4:19 PM

ప్రతి మనిషికి నిద్ర అనేది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు చాలా ముఖ్యం. అయితే ఆ నిద్ర ఎప్పుడు పోవాలి? పగటి పూట నిద్రపోవడం వల్ల కలిగే శుభ, అశుభ ఫలితాల గురించి జ్యోతిష్య నిపుణులు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శాస్త్రాల ప్రకారం.. అందరికీ పగటి నిద్రపోవడం చెడ్డది కాదు.. శారీరక స్థితిని బట్టి కొందరికి మినహాయింపులు ఉన్నాయి. వృద్ధులు – అనారోగ్యంతో ఉన్నవారు, చిన్న పిల్లలు, బాలింతలు వీరు తమ ఆరోగ్య అవసరాల కోసం పగటిపూట విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదని శాస్త్రం చెబుతోంది.

మధ్యాహ్నం నిద్ర ఎందుకు నిషిద్ధం?

శారీరకంగా దృఢంగా ఉండి, వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు పగటిపూట నిద్రపోవడం సరైనది కాదని పండితులు వివరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య నిద్రపోవడం వల్ల అనేక ప్రతికూల ఫలితాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో నిద్రపోవడం వల్ల నవగ్రహాల దుష్ప్రభావం మనపై పడే అవకాశం ఉంది. దైవిక శక్తి తగ్గి, ప్రతికూల శక్తులు మనల్ని ఆవహించే అవకాశం ఉంది. మధ్యాహ్నం నిద్ర వల్ల మెదడు మొద్దుబారి, పనిలో ఏకాగ్రత దెబ్బతింటుంది. పగటిపూట నిద్రపోయే వారికి పూర్వీకుల ఆశీర్వాదాలు లభించవని గ్రంథాలు చెబుతున్నాయి.

ఆఫీసు కుర్చీలో నిద్రపోతే..?

చాలామంది ఆఫీసుల్లో పని చేస్తూ కుర్చీల్లోనే నిద్రపోతుంటారు. దీన్ని పండితులు తీవ్రమైన అశుభంగా అభివర్ణించారు. “ఆఫీసు కుర్చీ అనేది మనం పని చేసే సింహాసనం లాంటిది. ఏ రాజూ తన సింహాసనంపై పడుకోడు. విధి నిర్వహణలో నిద్రపోవడం వల్ల అశుభ ఫలితాలు ఎదురవుతాయి” అని పండితులు తెలిపారు. ఒకవేళ నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే, వెంటనే లేచి కొంచెం నడిచి, ముఖం కడుక్కొని తిరిగి పనిలో నిమగ్నం కావాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

రాజకీయ నాయకులకు హెచ్చరిక

ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు బహిరంగ కార్యక్రమాలలో లేదా అసెంబ్లీలో నిద్రపోవడం వారి బలహీనతకు సంకేతంగా మారుతుందని, ఇది వారి రాజకీయ భవిష్యత్తుపై అశుభ ప్రభావాన్ని చూపుతుందని పండితులు వివరించారు. పనే దైవం అనే సూత్రాన్ని నమ్మి, పని వేళల్లో నిద్రకు దూరంగా ఉండటం వల్ల శారీరక, ఆర్థిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి.