IRCTC Shri Ramayana Yatra: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సిటిసి) శ్రీ రామాయణ యాత్ర ప్రత్యేక రైళ్లను నవంబర్ 7న ఢిల్లీ నుండి ప్రారంభించింది. తీర్థయాత్రలు చేసే వారికోసం ప్రవేశపెట్టిన రైలు.. అనేక పుణ్యక్షేత్రాల మీదుగా ప్రయాణిస్తుంది. శ్రీ రామాయణ యాత్ర ప్రత్యేక రైలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైంది. శ్రీరాముని జీవితానికి సంబంధించిన అన్ని ప్రధాన నగరాలను ఈ రైలు చుట్టేస్తుంది. ఇంకా కీలక విషయం ఏంటంటే ఈ రైలులో సంస్కృతిక, ఇతిహాసం, రామాయణానికి సంబంధించిన విశేషాలన్నీ ఈ రైలులో ప్రదర్శించడం జరుగుతుంది.
కాగా, IRCTC అధికారిక షెడ్యూల్ ప్రకారం.. శ్రీరామాయణ యాత్రకు సంబంధించి అనేక రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. మొదటి షెడ్యూల్ నవంబర్ 7న ప్రారంభమవగా.. రెండో పర్యటన నవంబర్ 16న ప్రారంభం కానుంది. ఇక మూడో పర్యటన నవంబర్ 25 నుంచి ప్రారంభం కానుంది. ఇక నవంబర్ 16 నుండి ప్రారంభమయ్యే శ్రీ రామాయణ యాత్ర.. మధురై రైలు ప్రయాణం 12 రాత్రులు/13 రోజులు సాగుతుంది. శ్రీరామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్- శ్రీ గంగానగర్ రైలు నవంబర్ 25 నుండి ప్రారంభమవుతుంది. ఇది 16 రాత్రులు/17 రోజులు ప్రయాణం ఉంటుంది.
శ్రీ రామాయణ యాత్ర ప్రత్యేక రైళ్ల షెడ్యూల్, స్టాప్‌ల వివరాలు ఇవి..:
1. అయోధ్య- శ్రీరామ జన్మభూమి ఆలయం, హనుమాన్ దేవాలయం, నందిగ్రామ్‌లోని భారత మందిరం.
2. బీహార్- సీతామర్హి, రామ్ – జాంకీ ఆలయం.
3. వారణాసి- ప్రయాగ, చిత్రకూట్, శృంగవర్‌పూర్‌లోని ఆలయాలు.
4. నాసిక్- త్రయంబకేశ్వరాలయం, పంచవటి.
5. హంపి- కృష్కింధ నగరం.
6. రామేశ్వరం- పర్యటన చివరి గమ్యస్థానం.
శ్రీ రామాయణ యాత్ర రైలు ఛార్జీలు:
భారత ప్రభుత్వంచే ‘దేఖో అప్నా దేశ్’ కార్యక్రమం కింద IRCTC ఈ ప్రత్యేక తీర్థయాత్ర రైలును ప్రారంభించింది. 2AC తరగతి ప్రయాణానికి ఒక్కో ప్యాసింజర్‌కి రూ.82,950, 1AC తరగతి ప్రయాణానికి రూ.1,02,095 చొప్పున ధర ప్రకటించింది IRCTC. ఈ ప్యాకేజీలలో భాగంగా.. AC తరగతులలో రైలు ప్రయాణం, AC హోటల్‌లలో వసతి, భోజనం(VEG మాత్రమే), పుణ్యక్షేత్రాల్లో AC వాహనాలలో ప్రయాణం, ప్రయాణ బీమా, IRCTC టూర్ మేనేజర్‌ల సేవలు, అవసరమైన ఆరోగ్య సేవలు, పర్యటన సమయంలో సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రయాణాన్ని అందించడం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.
Also read:
Watch Video: కైలాసగిరి కాదు.. విషపు నగరి.. కాలుష్యపు నీటిలో పుణ్యస్నానాలు.. వీడియో వైరల్