Temples in India: మన దేవాలయాలు ప్రపంచంలో అనేక దేశాలకంటే సంపన్నమైనవి అని తెలుసా…

హిందువులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. దేవుడిని పుజిస్తారు. పాపం, పుణ్యం అంటూ చేసే పనులను బట్టి జీవితం సాగుతుందని నమ్ముతారు. అందుకనే ఆధ్యాత్మిక యాత్రలను చేయడానికి ఇష్టపడతారు. దేవుడిని దర్శించుకోవడానికి వెళ్ళడం వలన మానసిక ప్రశాంత లభిస్తుందని నమ్మకం. అంతేకాదు దేవుడిని దర్శించుకున్న తర్వాత తమ శక్తి కొలదీ కానుకను సమర్పిస్తారు. సామాన్యులు మాత్రమే కాదు దేశాన్ని ఏలే నేత అయినా, అపర కుబెరుడైనా దేవుడి తల వంచి నమస్కరిస్తారు. మొక్కలు చెల్లించుకుంటారు. అయితే మన దేశంలోని కొన్ని దేవాలయాల సంపాదన ప్రభుత్వ పరం చేస్తే మన దేశం అప్పు మాత్రమే కాదు అనేక దేశాల అప్పులు కూడా తీర్చవచ్చని తెలుసా..

Temples in India: మన దేవాలయాలు ప్రపంచంలో అనేక దేశాలకంటే సంపన్నమైనవి అని తెలుసా...
Temples In India

Updated on: May 19, 2025 | 9:52 PM

మన దేశం ఆధ్యాత్మికతకు నెలవు. రకరకాల ఆలయాలున్నాయి. నాయకుల నుంచి నటుల వరకు, సామాన్యుల వరకు అందరూ దేవాలయాలకు వెళ్తారు. పూజలు నిర్వహిస్తారు. దేశంలో వేలాది దేవాలయాలు వాటి సొంత ప్రాముఖ్యతతో ప్రసిద్ధిగంచాయి. రోజూ కోట్లాది మంది భక్తులు తమ కోరికలు తీర్చమంటూ దేవుళ్ళకు అర్జీలు పెట్టుకుంటారు. ఆలయాల వద్దకు చేరుకుంటారు. అయితే మన దేశంలో కొన్ని దేవాలయాలు ఆదాయం ప్రపంచంలో కొన్ని దేశాల ఆదాయం కంటే ఎక్కువ. మన దేవాలయాల ఆదాయం కనుక ప్రభుత్వానికి ఇవ్వడం మొదలు పెడితే.. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్న దేశంగా ప్రసిద్ధి చెందగలదు. తిరుమల తిరుపతి క్షేత్రం, వైష్ణో దేవి ఆలయం ఇలా దేశంలోని కొన్ని ప్రసిద్ధ దేవాలయాలకు భక్తులు సమర్పించే కానుకల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుంది. ఈ దేవాలయాల సంపద ద్వారా భారతదేశం మొత్తం ప్రపంచాన్ని ఎలా పరిపాలించగలదో ఈ రోజు తెల్సుకుందాం.. ఇంకా చెప్పాలంటే ఈ ఆలయాల సంపద ద్వారా మన దేశం అప్పు మాత్రమే కాదు.. అమెరికా, చైనా వంటి దేశాల అప్పుని కూడా తీర్చేయవచ్చు అన్న మాట.. ఆ ప్రముఖ దేవాలయాల ఆదాయం, వాటి వనరుల గురించి వివరాల్లోకి వెళ్తే..

కేరళలోని త్రివేండ్రంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం దేశంలోని అత్యంత ధనిక ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఒక నివేదిక ప్రకారం ఈ ఆలయంలోని 6 ఖజానాలలో 20 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి ఉంది. ఈ ఆలయంలో విష్ణువు బంగారు విగ్రహం ఉంది. దీని విలువ రూ. 500 కోట్లు ఉంటుందని చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ధనిక ఆలయమే. వెంకన్న పేరుతో 9 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దాదాపు 650 కోట్ల రూపాయల విలువైన విరాళాలు కానుకల రూపంలో అందుతాయి. ఈ ఆలయం ప్రతి సంవత్సరం లడ్డూలు, ప్రసాదాల అమ్మకం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తుంది. ఈ ఆలయంలో వివిధ బ్యాంకుల్లో దాదాపు రూ.14000 కోట్లుకు పైగా నగదు డిపాజిట్ ఉంది.

మధురైలోని మీనాక్షి ఆలయం కూడా దేశంలోని అత్యంత ధనిక ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మీడియా నివేదికల ప్రకారం ఈ ఆలయ వార్షిక ఆదాయం రూ. 6 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ప్రతిరోజు దాదాపు 20 నుండి 30 వేల మంది ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తారు. షిర్డీ సాయి ఆలయం కూడా ధనిక ఆలయాల జాబితాలో ఉంది. ఈ ఆలయం బ్యాంకు ఖాతాలో 380 కిలోల బంగారం, 4428 కిలోల వెండితో పాటు రూ. 1800 కోట్లు జమ అయ్యాయి. ముంబైలోని సిద్ధివినాయక ఆలయానికి ప్రతి సంవత్సరం విరాళాలు, కానుకల ద్వారా దాదాపు రూ.125 కోట్లు వస్తుంది.

ఇవి కూడా చదవండి

అమెరికా, చైనా, పాకిస్తాన్ అప్పులు ఎంత అంటే..

ఇవి ప్రముఖ దేవాలయాలకు ఆదాయాలు మాత్రమే.. ఇంకా అనేక ప్రసిద్ది చెందిన ఆదాయ వనరులు కూడా ఉన్నాయి. అయితే మన దేశం మాత్రమే కాదు.. అమెరికా, చైనాతో సహా అనేక పెద్ద దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థ రుణాల భారంతో ఉందని మీకు తెలుసా.. అగ్రరాజ్యం అమెరికా మొత్తం అప్పు గత రెండు సంవత్సరాలలో 8.2 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. చైనా అప్పు దాదాపు 385 బిలియన్ డాలర్లు. ఇది ఆ దేశ GDPలో 5.8 శాతానికి సమానం. దాయాది దేశం పాకిస్తాన్ ఆర్ధిక పరిస్థతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాకిస్తాన్ కొత్త రుణం కోసం ప్రపంచ దేశాలవైపు ఆశగా చూసే పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో మన దేశంలోని ప్రముఖ దేవాలయాల సంపద, ఆదాయం కలిపితే.. మన దేశం సహా అనేక దేశాల రుణాన్ని తీర్చవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు