Vastu Tips: ఈ గుడ్ లక్ మొక్కలు మీ ఇంట్లో ఉంటే డబ్బుకు లోటుండదు..

| Edited By: Ravi Kiran

Dec 17, 2023 | 10:45 AM

హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఇంట్లో వాస్తు ప్రకారం అన్నీ కరెక్ట్ గా ఉంటేనే.. ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు. అదే విధంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే.. ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, తగాదాలు, గొడవలు ఇలా ఇంట్లో శాంతి కరువు అవుతుంది. ఇలా ఇంట్లోని కొన్ని రకాల వస్తువుల వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ..

Vastu Tips: ఈ గుడ్ లక్ మొక్కలు మీ ఇంట్లో ఉంటే డబ్బుకు లోటుండదు..
Vastu Tips
Follow us on

హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఇంట్లో వాస్తు ప్రకారం అన్నీ కరెక్ట్ గా ఉంటేనే.. ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు. అదే విధంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే.. ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, తగాదాలు, గొడవలు ఇలా ఇంట్లో శాంతి కరువు అవుతుంది. ఇలా ఇంట్లోని కొన్ని రకాల వస్తువుల వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ.. పెరుగుతుంది. అలాగే చాలా మంది మొక్కలను ఇంట్లో పెంచుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ నెలకొనడమే కాకుండా.. డబ్బుకు లోటు ఉండదని చెబుతున్నారు. మరి ఆ మొక్కలు ఏంటో ఒక సారి లుక్ వేసేయండి.

రాత్రాణి మొక్క:

ఇంట్లో రాత్రాణి మొక్క ఉంటే.. ఇంటి చుట్టూ సువాసన వెదజల్లుతుంది. ఈ సువాసనకు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా.. మనసిక ఉల్లాసన నెలకొంటుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, దాంపత్య సంతోషాన్ని మరింత పెంచుతుంది. తద్వారా సంపాదనకు కొత్త మార్గాల అన్వేషనకు ఉపయోగ పడుతుంది. ఈ మొక్కల పూలు లేత పుసుపు రంగులో ఉండి అందంగా కనిపిస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది.

చంపా మొక్క:

ఈ మొక్క ఇంట్లో ఉంటే ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. దీంతో కుటుంబ సభ్యలు మధ్య గొడవలు, తగాదాలు అనేవి ఉండవు. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగి.. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కుటుంబం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.

ఇవి కూడా చదవండి

మల్లె మొక్క:

మల్లె పూల మొక్క గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మొక్క గురించి అందరికీ తెలుసు. మంచి సువాసన వెదజల్లుతుంది. అంతేకాకుండా మల్లె పూలు అంటే లక్ష్మీ దేవి అమ్మవారికి ప్రతీకరం అని చెబుతూ ఉంటారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

పారిజాత మొక్క:

పారిజాత మొక్క ఇంట్లో ఉన్నా కూడా చాలా మంచిది. ప్రతి కోరికను తీర్చుతుందని అంటారు. ఈ మొక్క శ్రీ కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన మొక్క. ఈ మొక్క మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తుంది.