Vastu Tips: ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే మీ ఇంట్లో ఈ పూల మొక్కను పెంచుకోండి.. మార్పు గమనిస్తారు..!

|

Feb 13, 2023 | 12:33 PM

ఈ చెట్టు నాటిన ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాదని, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని వాస్తు శాస్త్రంలో సూచించారు. మీ వ్యాపారంలో ఏవైనా సమస్యలు ఉంటే, మీరు చేస్తున్న పనిలో తరచుగా అటంకాలు ఎదురవుతున్నట్టయితే, అర్ఘ్యం సమర్పించేటప్పుడు సూర్య భగవానుడికి ఈ పూలను సమర్పించి నమస్కారం చేసుకోవాలట..

Vastu Tips: ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే మీ ఇంట్లో ఈ పూల మొక్కను పెంచుకోండి.. మార్పు గమనిస్తారు..!
Hibiscus Plant
Follow us on

ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం పొందడానికి వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలు సూచించబడ్డాయి. ఇందులో మందార మొక్కకు సంబంధించిన నివారణ చాలా సులభమైన, ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రంలో ఇంట్లో పెంచుకునే చెట్లు, మొక్కల యొక్క ప్రత్యేక ప్రాముఖ్యతను వివరించబడింది. వాస్తు ప్రకారం, ఇంట్లో కొన్ని రకాల పూల మొక్కలు నాటడం వల్ల గ్రహాలు బలపడతాయి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అందులో భాగంగానే వాస్తులో మందార పువ్వు ముఖ్యంగా ప్రయోజనకరమైనదిగా సూచించారు నిపుణులు. మందార పువ్వు మహాలక్ష్మి దేవికి అత్యంత ప్రీతికరమైనది. ఇంట్లో పెంచుకోవడం వల్ల సూర్యుడు బలంగా ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైన పుష్పం కనుక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

మీ జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే, ఖచ్చితంగా మీ ఇంట్లో మందార మొక్కను నాటండి. ఇంటికి తూర్పు వైపు మందార మొక్కను నాటడం వల్ల సూర్యుని స్థానం బలపడుతుంది. ఈ మొక్కను నాటడం ద్వారా, ఇంట్లో తండ్రితో అనుబంధం ఎల్లప్పుడూ బాగుంటుంది. గౌరవప్రదామైన ప్రయోజనం పొందుతారు. మందార మొక్క కూడా మంగళ దోషాన్ని నాశనం చేస్తుంది. మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నట్లయితే, వివాహం మొదలైన వాటిలో జాప్యం ఉన్నట్లయితే మందార పూల మొక్కను ఇంట్లో నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఇంట్లో మందార మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వాస్తు ప్రకారం, లక్ష్మిదేవికి మందార పువ్వును సమర్పించడం ద్వారా ఆ వ్యక్తి అన్ని రకాల ఆర్థిక సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందుతాడు. ఇంట్లో సంపద పెరుగుతుంది. మందార చెట్టు నాటిన ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాదని, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని వాస్తు శాస్త్రంలో సూచించారు. మీ వ్యాపారంలో ఏవైనా సమస్యలు ఉంటే, మీరు చేస్తున్న పనిలో తరచుగా అటంకాలు ఎదురవుతున్నట్టయితే, అర్ఘ్యం సమర్పించేటప్పుడు సూర్య భగవానుడికి మందార పువ్వును సమర్పించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..