Devotional: పచ్చ కర్పూరంతో ఇలా చేశారంటే.. లక్ష్మీ ఎల్లప్పుడూ మీ వెంటే!

|

Oct 11, 2024 | 1:44 PM

కర్పూరం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కర్పూరాన్ని ఎక్కువగా పూజలో ఉపయోగిస్తూ ఉంటారు. కర్పూరంలో కూడా చాలా రకాలు ఉననాయి. ఇందులో పచ్చ కర్పూరం కూడా ఒకటి. కర్పూరం, పచ్చ కర్పూరాన్ని కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగించవచ్చు. అలాగే అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ విషయం అటు పెడితే.. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడం కర్పూరం చక్కగా పని చేస్తుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది..

Devotional: పచ్చ కర్పూరంతో ఇలా చేశారంటే.. లక్ష్మీ ఎల్లప్పుడూ మీ వెంటే!
Camphor
Follow us on

కర్పూరం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కర్పూరాన్ని ఎక్కువగా పూజలో ఉపయోగిస్తూ ఉంటారు. కర్పూరంలో కూడా చాలా రకాలు ఉననాయి. ఇందులో పచ్చ కర్పూరం కూడా ఒకటి. కర్పూరం, పచ్చ కర్పూరాన్ని కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగించవచ్చు. అలాగే అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ విషయం అటు పెడితే.. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడం కర్పూరం చక్కగా పని చేస్తుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు కర్పూరం ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన పచ్చ కర్పూరంతో ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలను నుంచి బయట పడొచ్చు. ఇంట్లో ధన వృద్ధి పెరగాలంటే ఈ చిట్కాలు ట్రై చేయండి.

పచ్చ కర్పూరం – పసుపు:

లక్ష్మీ దేవి విగ్రహం లేదా చిత్ర పటం ముందు ఒక గిన్నె తీసుకోవాలి. అందులో నీరు పోసి అందులో పచ్చ కర్పూరం, పసుపు వేసి ఉంచండి. ఆ తర్వాత దీపారాధన చేయండి. ఇలా రెండు రోజులకు ఒకసారి నీటిని మార్చుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలకు కూడా ఓ పరిష్కారం లభిస్తుంది. ఇంట్లో మంచి సువాసన కూడా వెదజల్లుతూ ఉంటుంది.

పచ్చ కర్పూరంతో మూట:

పసుపు లేదా పచ్చ రంగు ఉన్న వస్త్రాన్ని తీసుకుని అందులో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని ఉంచి.. మూట కట్టి దాన్ని ఇంటికి కుబేర స్థానంలో ఉంచి మూట కట్టాలి. ఆ తర్వాత దీపారాధన చేసి ధూపం చేయాలి. ఇలా రోజూ ధూపం వేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. అంతే కాకుండా మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇలా పూజలు చేయండి:

పచ్చ కర్పూరాన్ని మీ పూజ గది లేదా ఇంటికి ప్రధాన ద్వారం వద్ద కట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. క్రమంగా ఆర్థిక సమస్యలు కూడా తీరి.. ధన వృద్ధి చెందుతుంది. అలాగే చిన్న పచ్చ కర్పూరం ముక్కను పేపర్‌లో కట్టి మీరు ఉపయోగించే పర్సులో ఉంచితే.. అప్పుల నుంచి బయట పడతారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..