Tirumala Tree: దేవదేవుడు తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న భారీ వృక్షం నేల కూలింది. దేవాలయం ఆస్థాన మండపం దగ్గరున్న రావి చెట్టు యొక్క పెద్ద కొమ్మ నేలకొరిగింది. ఈ ఘటనలో ఒక దుకాణం పూర్తిగా ధ్వంసం కాగా, అక్కడే ఉన్న మరి కొన్ని చిన్న చిన్న దుకాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే, చెట్టు కూలిన సమయంలో ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. భక్తుల సంచారం లేని సమయంలో భారీ వృక్షం కూలడంతో భక్తులెవరూ గాయపడలేదు. భక్తులకు ఎలాంటి హాని కలగకపోవడంతో టీటీడీ అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. ఏళ్ల తరబడి ఉన్న రావి చెట్టు కావడంతో చెట్టుకు ఉన్న భారీ కొమ్మల్లో ఒక పెద్ద కొమ్మ విరిగిపడ్డంతో ఈ ప్రమాదం జరిగింది. విరిగిన కొమ్మలను తొలగించి ఆ మార్గంలో భక్తుల రాకపోకలను టీటీడీ అధికారులు పునరుద్ధరించారు.
19న వాచీల వేలం..
ఇలా ఉండగా, తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో హుండీల ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఈనెల 19న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ–వేలం వేయనుంది. టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీలకు చెందిన వాచీలు మొత్తం 38 లాట్లు ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
మరిన్ని వివరాలకు www.tirumala.org వెబ్ సైట్ లేదా, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ఇంకా, తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం 0877–2264429 నంబర్‌లో సంప్రదించవచ్చు.
Read also: Adilabad BJP Leaders: దాబా పే చర్చా.. అయ్యో హస్తం వీడి తప్పు చేశామా..?