Sabarimala: శబరిమల ఆలయంలో పూజారి మృతి.. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం..

|

Dec 07, 2023 | 1:27 PM

శబరిమల అయ్యప్ప ఆలయంలోని సహాయ పూజారి హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. మృతుడు తమిళనాడులోని కుంభకోణానికి చెందిన రామ్ కుమార్ (43)గా గుర్తించారు. గురువారం ఉదయం ఆలయంలోని గదిలో కుప్పకూలి పడి ఉన్నాడు. గుర్తించిన వెంటనే ఆలయ సన్నిధానం ఆస్పత్రికి హుటాహుటిన తరలించినా ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ ఘటన నేపథ్యంలో నేడు అయ్యప్ప ఆలయాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా తెరిచారు. శుద్ధి కార్యక్రమం అనంతరం ఆలయాన్ని తెరిచారు.

Sabarimala: శబరిమల ఆలయంలో పూజారి మృతి.. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం..
Sabarimala Temple
Follow us on

కేరళలోని పథనంతిట్టా జిల్లాలోని పవిత్ర క్షేత్రం శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మండల మకరవిళక్కు పూజలు కొనసాగుతున్నాయి. అయ్యప్ప స్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. అయితే శబరిమల అయ్యప్ప ఆలయంలోని సహాయ పూజారి హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. మృతుడు తమిళనాడులోని కుంభకోణానికి చెందిన రామ్ కుమార్ (43)గా గుర్తించారు. గురువారం ఉదయం ఆలయంలోని గదిలో కుప్పకూలి పడి ఉన్నాడు. గుర్తించిన వెంటనే ఆలయ సన్నిధానం ఆస్పత్రికి హుటాహుటిన తరలించినా ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ ఘటన నేపథ్యంలో నేడు అయ్యప్ప ఆలయాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా తెరిచారు. శుద్ధి కార్యక్రమం అనంతరం ఆలయాన్ని తెరిచారు. ఆలయాన్ని శుద్ధి చేసి కార్యక్రమం అయిన తర్వాత ఆలయం తలుపు  తెరవడంలో జాప్యం అయింది. దీంతో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు ఆలయ బయట చాలాసేపు వేచి ఉన్నారు.

మరోవైపు అయ్యప్ప సన్నిధానంలో రద్దీ నెలకొంది. రద్దీని నియంత్రించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని పతనంతిట్ట జిల్లా కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారులను హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. గత కొద్ది రోజులుగా అయ్యప్ప దర్శనం కోసం భక్తులు 10 గంటలకు పైగా నిరీక్షిస్తున్నారు. ఈ పరిస్థితి అదుపులో పెట్టె విధంగా చర్యలు తీసుకోమని కోర్టు ఆదేశించింది.

దర్శనం కోసం వచ్చిన భక్తుల్లో దాదాపు 20 శాతం మంది భక్తులు మహిళలు, పిల్లలు ఉన్నారని దేవస్వం బోర్డు తెలిపింది. జస్టిస్ అనిల్ కె నరేంద్రన్, జస్టిస్ జి గిరీష్‌లతో కూడిన డివిజన్ బెంచ్ నిలక్కల్ వద్ద వాహనాల పార్కింగ్ రుసుము వసూలు చేయడానికి ‘ఫాస్టాగ్’ వ్యవస్థ సరిగ్గా పని చేయాలనీ సూచించింది. ఫాస్టాగ్ పని చేయడంలో అసమర్థతగా ఉందని.. వెంటనే పరిష్కరించాలని పేర్కొంది. ఈ కేసు మంగళవారం మరోసారి విచారణకు రానుంది. ఇప్పటికే భక్తుల కోసం ఎడతావాల వద్ద సౌకర్యాలు కల్పించామని.. వాటి  జాబితా వర్చువల్ క్యూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని దేవస్వం బోర్డు కోర్టుకు తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

రెండు నెలల పాటు సాగే మండల-మకరు విళక్కు సీజన్ జనవరి 20 వరకూ కొనసాగనుంది. జనవరి 14 సంక్రాంతి పర్వదినం రోజున మకర జ్యోతి దర్శనం తర్వాత పడిపూజతో ఆలయాన్ని మూసివేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..