ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. నల్లమల అడవుల్లో కొలువైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం పైగా ఆదివారం సెలవు కూడా కలసి రావడంతో భక్తుల రద్దీ పెరిగింది.. వేకువజామున నుండి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్ లో బారులు తీరారు భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం ఇప్పటికే స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలుపుద చేశారు. భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే కల్పిస్తుంది. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది.
మరోవైపు రేపు ముక్కోటి ఏకాదశి.. కనుక భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి వచ్చే అవకాశం ఉన్నందున రేపటి వరకూ స్వామి వారికీ అభిషేకాలు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. జనవరి 2వ తేదీ ముక్కోటి ఏకాదశి రోజున మల్లన్న స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..