హిందూమతంలో దేవతలు, దేవుళ్లతో పాటు గ్రహాల ఆశీర్వాదం పొందడానికి జపం, ఉపవాసం ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది. ఆచారాల ప్రకారం వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనస్సు, శరీరం, ఆత్మ శుద్ధి చెంది భగవంతుని అనుగ్రహాన్ని కూడా పొందుతాయి. ఋషులు, మునులు పూర్వకాలం నుండి ఉపవాస సంప్రదాయాన్ని అనుసరించడానికి కారణం ఇదే. హిందూ మత విశ్వాసం ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా గ్రహానికి అంకితం చేయబడింది. గురువారం విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున ఆయనను పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో గురువారం ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాం.. దీని వలన విష్ణువుతో పాటు గురు గ్రహం అనుగ్రహం లభిస్తుంది.
గురువారం ఉపవాసం పాటించడం ద్వారా సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం, జ్ఞానం పెంపొందుతుంది అంతేకాదు గురు దోషం నుండి విముక్తి పొందుతారు. ఈ రోజున విష్ణువుతో పాటు దేవ గురు బృహస్పతిని కూడా నియమాను సారం పూజిస్తారు.
మత విశ్వాసాల ప్రకారం వరుసగా ఏడు రోజులు గురువారం ఉపవాసం చేయడం.. గురు గ్రహాన్ని పూజించడం వల్ల జాతకంలో గురు గ్రహానికి సంబంధించిన అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
వివాహంలో ఏ విధమైన జాప్యం జరుగుతున్నా.. లేదా వైవాహిక బంధం ఏర్పరచుకోవడంలో అడ్డంకులు ఏర్పడుతున్నా.. అటువంటి వారు ఖచ్చితంగా గురువారం ఉపవాసం పాటించాలి. ఈ రోజున విష్ణువు, అరటి చెట్టును పూజిస్తారు.
గురువారం ఉపవాసం పాటించడం ద్వారా విష్ణువు, లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలన్నింటిని తొలగిస్తుంది.
గురువారం నాడు ఉపవాసం చేయడం వల్ల సంతోషం, శ్రేయస్సు, శాంతి, పాపాల నుంచి విముక్తి, పుణ్యం లభిస్తాయి. అలాగే వైవాహిక జీవితంలోని ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఇది కాకుండా, గురువారం ఉపవాసం ఆర్థిక స్థితి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మొదటి సారి గురువారం ఉపవాసం ఉండబోతున్నట్లయితే.. కోరిక , విశ్వాసం ప్రకారం రోజులను ఎంచుకోవచ్చు. 5, 11, 21, 51, 101 మొదలైన రోజులు ఉపవాసం చేయవచ్చు. మీరు మొదటి సారి గురువారం ఉపవాస దీక్ష చేయనున్నట్లు అయితే గురువారం పుష్య నక్షత్రం సమయంలో ప్రారంభించాలి.
గురువారం నాడు ఉపవాసం పాటించడంలో ముఖ్యమైన నియమం ఏమిటంటే ఏ నెలలో నైనా శుక్ల పక్షం మొదటి గురువారం రోజు నుంచి ఉపవాస దీక్ష ప్రారంభించండి. ఈ వ్రతాన్ని 16 గురువారాలు ఆచరించాలి. 3 సంవత్సరాలు నిరంతరాయంగా కొనసాగించవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు