Horoscope Today: ఈ రాశివారు ఆర్థికంగా శుభవార్తలు వింటారు.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Dec 31, 2022 | 5:05 AM

ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ పరంగా శుభవార్త వింటారు. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు.

Horoscope Today: ఈ రాశివారు ఆర్థికంగా శుభవార్తలు వింటారు.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఒక విదేశీ సంస్థ నుంచి మంచి ఆఫర్ వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పొదుపు ప్రయత్నాలు చేస్తారు. ఒక శుభకార్యంలో చురుకుగా పాల్గొంటారు. స్నేహితులకు చేయూతనందిస్తారు. వృత్తి వ్యాపారాల వారు ఆర్థికంగా పురోగతి చెందుతారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సమస్య ఒకటి బంధువుల సహాయంతో పరిష్కారం అవుతుంది. పిల్లలు అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుబడుతుంది. ఊహించని విధంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి కానీ, ఉద్యోగంలో మాత్రం ఒకటి రెండు చిన్న సమస్యలు కొనసాగుతాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగం మారాలని ప్రయత్నాలు సాగిస్తారు. కొందరు మిత్రులు తప్పుడు సలహాలతో మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అదృష్ట యోగానికి, అధికార యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు, ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ఒక శుభకార్యం కోసం ప్లాన్ చేస్తారు. మిత్రులకు సహాయం చేస్తారు. బంధువులతో అపార్ధాలు తొలగిపోతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకు వెళతారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రుణ సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఇక రాదనుకున్న డబ్బు గురించి శుభవార్త వింటారు. ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. కుటుంబ పరంగా టెన్షన్స్ ఉంటాయి. బంధువులలో కొందరు మీ గురించి చెడు ప్రచారం ప్రారంభిస్తారు. స్నేహితులు అండగా నిలబడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పర్వాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కుటుంబ సమస్యను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికపరంగా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందవచ్చు. నిరుద్యోగులు కూడా శుభవార్త వింటారు. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి వ్యాపారాల వారికి విశేష పురోగతి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉద్యోగ జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పవు. ఆర్థికంగా నిలకడగానే ఉంటుంది. అదనపు ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు చేస్తారు. పిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. స్నేహితులతో విభేదాలు ఏర్పడవచ్చు. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ సమస్య కొద్దిగా తగ్గుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
సమయం అన్ని విధాలా బాగుంది. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. గృహ, వాహన సౌఖ్యాలను అనుభవిస్తారు. విదేశాల నుంచి పిల్లలు చూడటానికి వస్తారు. మిత్రులు, బంధువులు మీ సలహాలను పాటిస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగ జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదు కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.  ఇతరుల సమస్యల్లో తల దూర్చకపోవడం మంచిది. మితిమీరిన ఔదార్యంతో కొంత ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాల వారు లాభాలు గడిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కొన్ని ముఖ్యమైన పనులు మీరు ఆశించిన విధంగా పూర్తి కాకపోవచ్చు. అంతా మన మంచికే అనుకోవాలి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఉద్యోగ పరంగా విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు. పొదుపు ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాజకీయాల్లో కానీ, వ్యాపారంలో కానీ ప్రవేశించాలని ఆలోచిస్తారు. అవసరాలకు తగ్గ ఆదాయం ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు పెరిగి చిక్కుల్లో పడతారు. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. ఐటీ రంగ నిపుణులు పురోగతి సాధిస్తారు. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..