Horoscope Today 25 February 2021: ప్రస్తుత డిజిటల్ యుగంలో కూడా చాలా మంది రాశిఫలాలను నమ్ముతుంటారు. వారు ఏదైన పని మొదలు పెట్టాలన్నా.. లేదా ఈరోజు వారి భవిష్యత్తు ఏలా ఉందనేది తెలుసుకోవడానికి రాశిఫలాలను చూస్తుంటారు. ఈరోజున సూర్యుడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. అలాగే శని, గురుడు, బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు. మరీ ఈ క్రమంలోని మేష రాశి నుంచి మీన రాశి వరకు ఎవరి రాశిఫలాలు ఏలా ఉండబోతున్నాయనే ఇప్పుడు చూద్దాం.
ఈ రాశివారు ఈరోజు ఇతరులతో వ్యవహరించే సందర్బంలో గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకోవడం మంచిది. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవకపోవడం మంచిది. ఈరోజు విష్ణు సహస్ర నామ స్త్రోత్రం పఠిస్తే శుభఫలితాలు లభిస్తాయి.
ఈరాశివారు విలువైన వస్తువులు లేదా అభరణాలను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా మీకు దగ్గర్లోని పలు కుటుంబ శుభకార్యక్రమాల కోసం ప్రణాళిక వేసుకుంటారు. ఈరోజున ఈ రాశివారు పరమేశ్వరుని ఆరాధించడం మేలు చేస్తుంది.
ఈరాశివారు ఉమ్మడి వ్యవహారిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాల్లో ఇబ్బందులను ఎదుర్కోంటారు. అలాగే పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. గణపతి ఆరాధించడం వలన సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఈరాశివారికి ఈరోజున రావాల్సిన బాకీలు కాస్తా ఆలస్యమవుతుంటాయి. వీరు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పార్వతి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించడం వలన శుభఫలితాలను పొందవచ్చు.
ఈరాశివారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతుంటాయి. శివాలయంలో స్వామివారికి ఆవు నేతితో దీపారాధన చేయడంమనేది ఉత్తమం.
ఈరాశివారు ఈరోజు వ్యక్తిగత గౌరవ మర్యాద విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశాలున్నాయి. ఈరోజున సంకటనశాకన గణపతి స్త్రోత్ర పరాయణం మేలు చేస్తుంది.
ఈరాశివారు ఈరోజు వేరు వేరు రూపాల్లో అవకాశాలు అందుకునే అవకాశం ఉంది. కానీ వాటిని వృథా చేసుకోకుండా.. సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. షేర్లు పెట్టుబడుల విషయంలో లాభాలు పొందే అవకాశాలున్నాయి. విష్ణును ఆరాధించడం మంచిది.
ఈరాశివారు ఈరోజు చేసే పనుల్లో ప్రారంభంలోనే కొన్ని ఇబ్బందులను లేకుండా చూసుకోవాలి. వీలైనంతవరకు పెద్దవారి సలహాలు, సూచనలుమేలు తీసుకోవడం ఉత్తమం. శివరాధన చేయడం, స్వామికి బిల్వదర్బణ సమర్పణ చేయడం మంచిది.
ఈరాశివారు ఈరోజున వేరు వేరు రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీరాజమాతంగి నమః అనే నామార్చణ మేలు చేస్తుంది.
ఈరాశివారు ఈరోజు తమ మాట విలువ కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీరికి అనేకమైనవటి బాధ్యతలు పెరుగుతాయి. విష్ణువుకు తులసి దళములు ఇవ్వడం. పులిహోర సమర్పించడం ఉత్తమం.
ఈరాశివారు ఈరోజు చేపట్టినటువంటి జాగ్రత్త లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుంది. ఎదుటివారి విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకుడదు. లక్ష్ణీ నరసింహ నామార్చణ చేయడం మంచిది.
ఈరాశివారు ఈరోజు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవరసర ఖర్చులు పెరుగుతాయి. అష్టలక్ష్మీ స్త్రోత్రం చేయడం మంచిది.
Also Read:
మాఘ పూర్ణిమ 2021: మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏమిటి ? ఆరోజున ఏవిధంగా భగవంతుడిని ఆరాధించాలంటే..