Holi 2024: హోలీ నాడు ఈ వస్తువులను దానం చేస్తే.. మీకు ఎన్ని రకాల కష్టాలు వస్తాయో తెలుసా!

|

Mar 03, 2024 | 12:29 PM

హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ హోలీ రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేస్తే అవి మీకు అదృష్టాన్ని తెస్తాయి. కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో సంతోషం కలుగుతుంది. అదే సమయంలో పురాణ గ్రంథాలలో హోలికా దహనం రోజున కొన్ని వస్తువులను దానం చేసే విషయంలో కఠినమైన నిషేధం ఉంది. వీటిని దానం చేయడం వల్ల జీవితంలో కష్టాలు పెరుగుతాయి.

Holi 2024: హోలీ నాడు ఈ వస్తువులను దానం చేస్తే.. మీకు ఎన్ని రకాల కష్టాలు వస్తాయో తెలుసా!
Holi 2024
Follow us on

హిందూ మతంలో రంగుల పండుగ హోలీని ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలు హోలీ పండగ కోసం చాలా రోజుల ముందుగానే సన్నాహాలు ప్రారంభిస్తారు. అయితే హోలీ అంటే రంగులను జల్లుకునే పండగ మాత్రమే కాదు.. ఈ రోజు హోలికా దహనం , పూజ వంటి విశేష కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో హోలీ పండగ రోజున చేసే పూజ, దానాలకు విశిష్ట స్థానం ఉంది. కొన్ని రకాల వస్తువులను దానం చేస్తే అతని జీవితంలో ఎప్పుడు డబ్బులకు లోటు ఉండదని.. సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం. అయితే జ్యోతిష్యం ప్రకారం హోలీ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదు. లేకపోతే ఇంట్లో అనేక రకాల సమస్యలు తలెత్తవచ్చు. హోలీ రోజున ఏ వస్తువులు దానం చేయకూడదో తెలుసుకుందాం.

హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ హోలీ రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేస్తే అవి మీకు అదృష్టాన్ని తెస్తాయి. కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో సంతోషం కలుగుతుంది. అదే సమయంలో పురాణ గ్రంథాలలో హోలికా దహనం రోజున కొన్ని వస్తువులను దానం చేసే విషయంలో కఠినమైన నిషేధం ఉంది. వీటిని దానం చేయడం వల్ల జీవితంలో కష్టాలు పెరుగుతాయి.

ఈ వస్తువులను దానం చేయవద్దు

వాస్తు శాస్త్రం ప్రకారం హోలికా దహనం లేదా హోలీ రోజున ఇనుము లేదా ఉక్కు వస్తువులను దానం చేయకూడదు. అలాగే ఈ వస్తువులను ఎవరి దగ్గరా తీసుకోకూడదు. ఈ వస్తువులను దానం చేయడం లేదా ఇవ్వడం ద్వారా జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు.

ఇవి కూడా చదవండి

తెల్లటి వస్తువులు శుక్రుడు గ్రహానికి సంబంధించినవిగా నమ్మకం. కనుక హోలికా దహనం, రంగురంగుల హోలీ రోజున, పాలు, పెరుగు, చక్కెర మొదలైన తెల్లటి వస్తువులను ఎప్పుడూ దానం చేయకూడదు. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న శుక్ర గ్రహం బలహీనంగా మారవచ్చు. అంతేకాదు శుక్ర దోషం తలెత్తవచ్చు. ఇది జీవితంలో సుఖ సంతోషాలపై ప్రభావం చూపిస్తుంది.

సాధారణంగా బట్టలు దానం చేయడం పుణ్య కార్యంగా పరిగణించబడుతుంది. అయితే హోలికా దహనం, రంగుల హోలీ రోజున వస్త్రదానం చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రెండు రోజులలో ఏ రోజైనా బట్టలు దానం చేస్తే.. అతని జీవితంలో సిరి సంపదలు క్రమంగా దూరమవుతాయని నమ్మకం.

వాస్తు శాస్త్రం ప్రకారం హోలికా దహనం లేదా హోలీ రోజున డబ్బును ఎప్పుడూ దానం చేయకూడదు. ఈ రోజున డబ్బును దానం చేయడం వల్ల జీవితాంతం ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి.

మహిళలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

హోలికా దహనం రోజున వివాహితలు పసుపు, కుంకుమ వంటి వస్తువులను దానం చేయకూడదు. హోలికా దహనం రోజున అగ్నిలో ప్రతికూల శక్తులు నశించి ఇంట్లో సానుకూలత ఏర్పడుతుందని నమ్ముతారు. కనుక ఈ రోజున మీరు ఉపయోగించిన పెళ్లి వస్తువులను ఏ ఇతర స్త్రీకి ఇవ్వకండి. ఇలా చేయడం వల్ల భర్తకు హాని కలుగుతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు