Holi 2022: రంగుల కేళి.. హోలీ పర్వదినాన్ని పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అందుకనే హోలీని ఫెస్టివల్ ఆఫ్ కలర్స్(Colours Of Festival) అంటారు. ఒకప్పుడు ఉత్తర భారతం(North India) లో ఘనంగా జరుపుకునే ఈ హోలీ పండగను.. ఇప్పుడు దేశం అంతటా జరుపుకుంటున్నారు. అయితే ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క సంప్రదాయంతో హోలీని పండగను నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గుజరాత్, బీహార్ ఇలా అనేక ప్రాంతాల్లో హోలీ పండగను ఒకొక్క రీతిన జరుపుకుంటారు. అయితే బీహార్ లో మాత్రం హొలీ వేడుకలను చెప్పులతో కొట్టుకుంటూ జరుపుకుంటారు.
బీహార్ రాజధాని పాట్నాలో హొలీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ హొలీ వేడుకలను ఓ వింత ఆచారంతో స్థానికులు జరుపుకుంటున్నారు. పాట్నాలోని వాటర్ పార్క్ ఉంది. అక్కడ నిర్వహించిన హోలీలో స్థానికులు ఒకరికొకరు చెప్పులు విసురుకుంటూ కనిపించారు. వాటర్ పార్క్ ను రంగుల నీరుతో నింపేశారు. ఆ తర్వాత స్థానికులు నీళ్లలోకి దిగి.. అందరూ ఒకరిని మరొకరు చెప్పులతో కొట్టుకున్నారు. కొందరు చెప్పుల దెబ్బలు తినలేక అక్కడ నుంచి పారిపోయారు.. వారి వెంటబడి మరీ చెప్పులతో రంగుల నీరుతో హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
ఇలా చెప్పులతో హొలీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కారణం.. కూడా ఉందట. చెడు మీద మంచి విజయాన్ని సాధించిన గుర్తుగా హొలీ ఏ విధంగా జరుపుకుంటామో.. మనలో ఉన్న చెడు తొలగి.. మంచి ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఇలా చెప్పులతో కొట్టుకుంటూ హోలీని జరుపుకుంటారట.
#WATCH पटना : वाटर पार्क में होली के जश्न के दौरान लोग एक-दूसरे पर चप्पल फेंकते दिखे। pic.twitter.com/eFAY65wsU7
— ANI_HindiNews (@AHindinews) March 17, 2022
Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేటు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో
పియానో వాయిస్తూ.. గొంతు సవరించుకున్న కుక్క.. సంగీత కచేరీకి టికెట్లు మొత్తం కొనేస్తా అంటున్న నెటిజన్