Temple in Pak: పవిత్ర కార్తీక మాసంలో స్పెషల్ అట్రాక్షన్‌.. పాక్‌లో 200 ఏళ్ల నాటి ఆలయం.. ఈ గుడి ప్రత్యేకతలేంటో తెలుసా?

|

Nov 09, 2022 | 7:04 AM

పవిత్ర కార్తీక మాసంలో ఆ ఆలయం అందరినీ ఆకట్టుకుంటోంది.. అక్కడికి చేరుకోవాలంటే నదీ ప్రయాణం చేయాల్సిందే.. అయితే, ఆ దేవాలయం మన దేశంలో లేదు.

Temple in Pak: పవిత్ర కార్తీక మాసంలో స్పెషల్ అట్రాక్షన్‌.. పాక్‌లో 200 ఏళ్ల నాటి ఆలయం.. ఈ గుడి ప్రత్యేకతలేంటో తెలుసా?
Sadhu Bela Mandir
Follow us on

పవిత్ర కార్తీక మాసంలో ఆ ఆలయం అందరినీ ఆకట్టుకుంటోంది.. అక్కడికి చేరుకోవాలంటే నదీ ప్రయాణం చేయాల్సిందే.. అయితే, ఆ దేవాలయం మన దేశంలో లేదు. మన దాయాది దేశం పాకిస్తాన్‌లోని ఉంది. అవును.. జై సాధుబేలా నినాదాలతో ఆ ఆలయం మర్మోగుతోంది. కార్తీక మాసంలో ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోడానికి భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఆ ఆలయం మన దేశంలోనిది కాదు. పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌లోని సాధుబేలా ఆలయం ఆందరినీ ఆకట్టుకుంటోంది.. దేశ విభజన తర్వాత కూడా ఉనికిని కాపాడుకుంటూ వచ్చిన ఈ ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది.

సుక్కుర్‌ జిల్లాలోని సింధునది మధ్యలో ఉన్న సాధుబేలా చేరాలంటే పడవ ప్రయాణం చేయాల్సిందే. పాలరాయి, గంధపు చెక్కలతో నిర్మించిన సాధుబేలా ఆలయం కోసం అప్పట్లో కొందరు సంపన్న ముస్లింలు భూమిని విరాళం ఇచ్చారు. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌ నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారులు దీన్ని నిర్మించారు. పాకిస్తాన్‌ వ్యాప్తంగా ఉన్న హిందువులు పండుగలు, మతాచారాల కోసం సాధుబేలా ఆలయానికి వస్తారు.

ఇక వచ్చే సంవత్సరం ఈ ఆలయం ద్విశతాబ్ది వేడుకలను నిర్వహించుకోడానికి సిద్ధమవుతోంది. దేశ విభజన తర్వాత ఎంతో మంది హిందువులు ఇక్కడి నుంచి వలసపోవడంతో ఆలయ బాధ్యతలను ఎవాక్యూ ట్రస్ట్ స్వాధీనం చేసుకుంది. శికార్‌పూర్‌ హిందూ సమాజం ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ఒకప్పుడు ఇక్కడ 537 దేవాలయాలు ఉండేవి. ఇప్పుడు 27 దేవాలయాలు మాత్రమే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోందని వారంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈలింక్ క్లిక్ చేయండి..