పురాణాల నమ్మకాల ప్రకారం హిందూ మతంలో పూర్వకాలం నుంచి నేటి వరకూ అనేక సంప్రదాయాలను అనుసరిస్తూ ఉన్నారు. మన తాతముత్తాల కాలం నుంచి కొన్ని పనులను చేసే విషయంలో నమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. అలంటి నమ్మకమే ఒకటి జుట్టు కత్తిరించుకోవడం. అవును జుట్టు కత్తిరించుకోవడానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి. వారంలో ఏ రోజు జుట్టు కత్తిరించుకోవాలి? ఏ రోజు జుట్టు కత్తిరించకూడదు? ఈ రోజు తెలుసుకుందాం..
సోమవారం, బుధవారం, శుక్రవారం జుట్టు కత్తిరించుకోవడానికి అత్యంత పవిత్రమైన రోజులుగా చెబుతారు. అదే సమయంలో మంగళవారాలు, శనివారాలు, ఆదివారాల్లో జుట్టు కత్తిరించడం నిషేధించబడింది. అంతేకాదు తిధుల్లో అమావాస్య, పౌర్ణమి తిధుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు. ఇక ఏ రోజు అయినా సరే సూర్యాస్తమయం తర్వాత జుట్టు కత్తిరించకూడదు. ఇలా చేయడం వలన ఆ వ్యక్తి ఆరోగ్యం, శక్తి , శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు.
సోమవారం చంద్రునికి సంబంధించిన రోజు అని చెబుతారు. ఈ రోజున జుట్టు కత్తిరించడం వల్ల కుటుంబ సంబంధాలు బలపడతాయని.. తద్వారా కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయని నమ్ముతారు.
బుధవారం రోజున జుట్టు కత్తిరించుకోవడం వల్ల వ్యక్తి ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుందని అంటారు. ఈ రోజు గణేశుడికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం వలన డబ్బు కొరత ఎప్పటికీ ఉండదని నమ్ముతారు.
శుక్రవారం శుక్రునికి అంకితం చేయబడిన రోజు అని నమ్మకం. ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం వల్ల సంతోషకరమైన వైవాహిక జీవితం లభిస్తుంది. ఇది కుటుంబంలో గౌరవాన్ని తెస్తుందని , భార్యాభర్తల మధ్య ప్రేమ మాధుర్యాన్ని పెంచుతుందని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు