
పురాణాల ప్రకారం కలియుగంలో హనుమంతుడిని పూజిస్తే.. వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. సనాతన ధర్మంలో హనుమంతుడు నేటికీ భూమి మీద నడయాడుతున్న దైవం. ఇప్పటికీ భూమిపై ఉన్నాడు కనుక కలియుగంలో ఆయన ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ప్రతి దేవుడిని పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే హనుమంతుడి పూజ మహిళలు చేయాలంటే.. పూజకు సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అంటే మహిళలు హనుమంతుడిని పూజించేటప్పుడు అతని విగ్రహాన్ని తాకకూడదు. ఈ నియమం వెనుక కారణం ఏమిటంటే..
హనుమంతుడి విగ్రహాన్ని మహిళలు ఎందుకు ముట్టుకోకూడదు?
దీనికి సంబంధించి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. నమ్మకాల ప్రకారం హనుమంతుడు బ్రహ్మచారి. అయితే, హనుమంతుడి వివాహం గురించిన వర్ణన కొన్ని పురాణ గ్రంథాలలో కనిపిస్తుంది. మత గ్రంథాల ప్రకారం, హనుమంతుడు వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహం విద్యను పూర్తి చేయడానికి.. చేసుకున్నాడు. హనుమంతుడు తన గురువైన సూర్యుడి నుంచి వేదాలను నేర్చుకున్నాడు. అయితే ముఖ్యమైన గ్రంథం నవ వ్యాకర్ణాలు వివాహితుడికి లేదా ‘గృహస్తునికి మాత్రమే అధ్యయనం చేసే అవకాశం ఉంది. దీంతో సూర్య దేవుడు అతనికి తన కుమార్తె సువర్చలతో వివాహం జరిపించాడు.
హనుమంతుడు తన విద్యను పూర్తి చేయడంలో సహాయపడటానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సూర్య భగవానుడి వద్దకు వెళ్లి సూర్యుని కిరణాల ప్రకాశం నుంచి సువర్చలా దేవిని సృష్టించారు. సువర్చల ఒక అయోనిజా.. అంటే ఆమె గర్భం నుంచి జన్మించలేదు. అప్పుడు హనుమంతుడితో ఆమె వివాహం జరిగింది. ఆమె సూర్య గురు దక్షిణ రూపంగా..హనుమంతుడిని తనను వివాహం చేసుకోమని కోరింది. వివాహిత అయినప్పటికీ సువర్చల జీవితాంతం బ్రహ్మచారిణిగా మిగిలిపోయింది.
స్త్రీలు హనుమంతుడిని పూజించడానికి నియమాలు
హనుమంతుడు ప్రతి స్త్రీకి తల్లిగా సమాన హోదా ఇచ్చాడు. జీవితాంతం బ్రహ్మచర్యాన్ని అనుసరించాడు. అందుకే స్త్రీలు హనుమంతుడి విగ్రహాన్ని తాకరు. అయితే పూజించవచ్చు. ఇతర పూజాది కార్యక్రమాలు చేయవచ్చు. దీపం వెలిగించవచ్చు. హనుమాన్ చాలీసా చదవవచ్చు. నైవేద్యాన్ని తయారు చేసి సమర్పించవచ్చు. ప్రసాదం కూడా అందించవచ్చు. కానీ పొరపాటున కూడా హనుమంతుడి విగ్రహాన్ని తాకరాదని పురాణాల కథనం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు