Hanuman Jayanti: జీవితంలో సమస్యలా హనుమాన్ జయంతి రోజున ఇలా పూజించండి.. శుభ సమయం ఎప్పుడంటే

|

Mar 30, 2024 | 7:21 AM

హనుమంతుడి జయంతిని ఆంజనేయ స్వామి పుట్టినరోజున జరుపుకుంటారు. మరొకటి రెండోవది సీతాదేవి హనుమంతుడిని చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించిన రోజుని వేడుకగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో హనుమాన్ జయంతి ఏ రోజు వస్తుంది. ఈ రోజుతో సంబంధం ఉన్న సనాతన ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.. 

Hanuman Jayanti: జీవితంలో సమస్యలా హనుమాన్ జయంతి రోజున ఇలా పూజించండి.. శుభ సమయం ఎప్పుడంటే
Hanuman Puja
Follow us on

హనుమాన్ జయంతి ప్రధాన హిందూ పండుగలలో ఒకటి. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ జయంతి పండుగను సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు. దీని వెనుక రెండు భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి. ఒకటి హనుమంతుడి జయంతిని ఆంజనేయ స్వామి పుట్టినరోజున జరుపుకుంటారు. మరొకటి రెండోవది సీతాదేవి హనుమంతుడిని చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించిన రోజుని వేడుకగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో హనుమాన్ జయంతి ఏ రోజు వస్తుంది. ఈ రోజుతో సంబంధం ఉన్న సనాతన ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..

హనుమంతుడి జయంతి 2024 ఎప్పుడు జరుపుకుంటారంటే

ప్రతి సంవత్సరం చైత్ర మాసం పౌర్ణమి రోజున హనుమంతుడి జన్మదినోత్సవం జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి పూర్ణిమ తిథి ఏప్రిల్ 23 తెల్లవారుజామున 3:25 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 24, 2024 ఉదయం 5:18 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో హనుమంతుడి జయంతిని ఏప్రిల్ 23 మంగళవారం జరుపుకోనున్నారు.

హనుమాన్ జయంతి ప్రాముఖ్యత

రామ భక్త  హనుమంతుడి పుట్టిన రోజుగా ఈ రోజు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. విశ్వాసం ప్రకారం  బజరంగబలిని ఈ రోజున హృదయపూర్వకంగా పూజించే భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. అంతేకాదు అన్ని రకాల భయాలు, ఇబ్బందుల నుండి విముక్తి పొందుతాడు. హనుమాన్ జయంతి సోదరభావం, ఐక్యతకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఎందుకంటే హనుమంతుడి భక్తులందరూ కలిసి ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

హనుమంతుడిని ఎలా పూజించాలి

హనుమంతుడి జయంతి రోజున పొద్దున్నే నిద్రలేచి  హనుమంతుడిని స్మరించుకుని ఆయనకు హృదయపూర్వకంగా నమస్కరించండి. దినచర్యలు ముగించుకున్న తర్వాత ఇల్లు శుభ్రం చేసి స్నానం చేయండి. గంగాజలం ఉంటే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి. ఎరుపు రంగు పూలు, పండ్లు, ధూపం, దీపం, సింధూరం మొదలైన వాటితో హనుమంతుడిని పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. నమ్మకం ప్రకారం ఈ రోజున హనుమాన్ చాలీసా లేదా బజరంగ్ బాణ్ పఠిస్తే హనుమంతుడు త్వరగా సంతోషిస్తాడు. అంతేకాదు సుందరకాండ పఠించడం అత్యంత ఫల వంతం. హారతిని ఇచ్చి పూజ ముగించి..  ఆనందం, శ్రేయస్సు, బలం, తెలివి, జ్ఞానం, శక్తి ఇవ్వమని బజరంగబలిని ప్రార్థించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు