రామ భక్త హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి దేశ వ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు రెడీ అవుతున్నారు. ఆంజనేయస్వామి ఆలయాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంజనేయస్వామి ఆలయాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు మహిళలు హనుమంతుడికి భారీ లడ్డుని సమర్పించడానికి రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 6న హనుమాన్ జన్మదినోత్సవాన్ని ఈ ప్రత్యేక లడ్డుని నైవేద్యంగా పెట్టి.. అనంతరం లడ్డుని భక్తులకు పంపిణీ చేయనున్నారు. వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని పురాతన పచ్చమఠ హనున్మ దేవాలయాన్ని కొన్ని దశాబ్దాల క్రితం గోండు రాజులు నిర్మించారు. ఈ ఆలయంలో హనుమంతు జన్మదినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను జరపడానికి భక్తులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు హనుమంతుడికి సమర్పించడానికి భారీ లడ్డుని రెడీ చేశారు. ఒక టన్ను బరువున్న లడ్డుని ప్రసాదంగా హనుమంతుడికి పూజలను నిర్వహిస్తున్నారు. అనంతరం ఈ లడ్డుని ఏప్రిల్ 6వ తేదీన భక్తులకు ప్రసాదంగా వితరణ చేయనున్నారు. ఇలా లడ్డుని రామ భక్త హనుమాన్ కు సమర్పించే సంప్రదాయం ఒక ఏడాది క్రితం నగరంలోని యువకులు మొదలు పెట్టారు. ఈ ఏడాది కూడా ఈ లడ్డు ప్రసాదాన్ని కొనసాగిస్తూ మహిళలు భారీ లడ్డు తయారీకి గత వారం రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
టన్ను లడ్డూలను తయారు చేసేందుకు చెఫ్‌లు వారం రోజుల నుంచి శ్రమిస్తున్నారు. ఈ ప్రత్యేక లడ్డూను తయారు చేయడానికి తగిన నైపుణ్యం ఉండాల్సి ఉంది. వారం రోజులు శ్రమించి తయారు చేసిన ఈ భారీ లడ్డుని వేద మంత్రాల నడుమ పూజాదికార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేకమైన నైవేద్యం ఆలయంలో హనుమాన్ జయంతి వరకు ఆలయంలో ఉంచబడుతుంది. ఏప్రిల్ 6 న పూజ అనంతరం భక్తులకు అన్నదానం చేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక లడ్డుని భక్తులకు పంపిణీ చేస్తారు. సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించబడుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..