కార్తీక మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి తిధి రోజున గోవర్ధన పూజ పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి మరుసటి రోజున గోవర్ధన్ పూజ జరుపుకుంటారు. అయితే కొన్నిసార్లు గోవర్ధన్ పూజ పండుగ, దీపావళి మధ్య ఒక రోజు గ్యాప్ ఉంటుంది. ఈసారి కూడా అదే జరిగింది. ఈసారి కార్తీక అమావాస్య తిథి రెండు రోజులు రావడంతో దీపావళిని రెండు రోజులు జరుపుకున్నారు. అటువంటి పరిస్థితిలో వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం గోవర్ధన్ పూజ ఈ రోజు అంటే 2 నవంబర్ 2024, శనివారం జరుపుకోనున్నారు. ఈ పండుగను ప్రధానంగా ఉత్తర భారతదేశంలోని మధుర, బృందావన్, నందగావ్, గోకుల్, బర్సానాలలో జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడు స్వయంగా గోవర్ధన్ పూజ ప్రాముఖ్యతను వివరించాడు. దేవేంద్రుడి అహంకారాన్ని కృష్ణుడు తొలగించిన రోజుని గోవర్ధన పూజ గా జరుపుకుంటారు.
బృందావనం వెళ్లి గోవర్ధన పూజ చేయలేని వారు ఇంట్లో ఆవుపేడను ముద్దగా పెట్టి గోవర్ధన గిరిగా భావించి పూజిస్తారు. కార్తిక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యం లభిస్తుందని నమ్మకం. కార్తిక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల మూడు రోజులు గోపూజ చేస్తే ఇహమందు ఐశ్వర్యమును అనుభవించి అంత్యమున విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. క్యాలెండర్ ప్రకారం గోవర్ధన పండుగ ఈ రోజు అంటే నవంబర్ 2 న జరుపుకొనున్నారు.
గోవర్ధన్ పూజ రోజున ఆవు పేడతో కృష్ణుడు, గోవర్ధన గిరి విగ్రహాన్ని తయారు చేస్తారు. ఆ విగ్రహాన్ని ఆచారబద్ధంగా పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో గోవర్ధన పూజ కోసం సిద్ధమవుతున్నట్లయితే, ఈ రోజు గోవర్ధన్ పూజకు సంబంధించిన ప్రతి విషయం గురించి తెలుసుకుందాం. గోవర్ధన్ పూజకు శుభ సమయం ఏమిటి? ఎలా పూజించాలి, గోవర్ధన పూజలో ఏయే వస్తువులు అవసరం.. గోవర్ధన పూజ సమయంలో ఏమి చేయకూడదు అనే విషయాలను తెలుసుకుందాం..
దృక పంచాంగం ప్రకారం కార్తీక మాసం శుక్ల పక్షం పాడ్యమి తిధి నవంబర్ 1వ తేదీన సాయంత్రం 6:16 నుండి ప్రారంభమై ఈరోజు అంటే నవంబర్ 2వ తేదీ రాత్రి 8:21 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం నవంబర్ 2న గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు.
నవంబర్ 2వ తేదీ ఉదయం 6:34 నుండి 8:46 వరకు గోవర్ధన్ పూజ యొక్క శుభ సమయం ఉంటుంది.
అంతేకాదు గోవర్ధన పూజకు రెండవ శుభ సమయం నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 5:34 వరకు ఉంటుంది.
గోవర్ధన పూజ కోసం తాళి, కుంకుమ, అక్షతలు, ధూప దీపం, కలశం, కుంకుమ, నైవేద్యం, స్వీట్లు, గంగాజలం, తమలపాకులు, పువ్వులు, పెరుగు, తేనె, పూల మాల, ఖీర్, ఆవనూనె దీపం, ఆవు పేడ, గోవర్ధన పర్వతం ఫోటో , శ్రీ కృష్ణుని విగ్రహం లేదా చిత్రం, గోవర్ధన్ పూజ కథ పుస్తకం.
గోవర్ధన్ పూజ రోజున ఏమి చేయాలంటే
गोवर्धन धराधार गोकुल त्राणकारक।
विष्णुबाहु कृतोच्छ्राय गवां कोटिप्रभो भव।। ।।
.గోవర్ధన ధరాధర గోకుల త్రాణకారక్|
విష్ణుబాహు కృతోచ్ఛ్రాయ గవాం కోటిప్రభో భవ||
గోవర్ధన పూజ రోజున అన్నకూట్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున వివిధ రకాల ఆహార పదార్థాలను శ్రీకృష్ణుడికి భోగ్‌గా సమర్పిస్తారు. గోవర్ధన పూజ రోజున శ్రీకృష్ణుడికి 56 నైవేద్యాలు సమర్పించే సంప్రదాయం కూడా ఉంది.
గోవర్ధన పూజ చేయడం వల్ల మనిషి జీవితంలో సంపద, సంతానం, గో సంపద పెరుగుతుంది. అలాగే వ్యక్తి అన్ని సమస్యల నుండి ఉపశమనం పొందుతాడు. గోవర్ధన పూజ చేసే వ్యక్తి శ్రీకృష్ణుని శాశ్వతమైన అనుగ్రహాన్ని పొందుతాడు.
గోవర్ధన పూజను చాలా చోట్ల అన్నకూట్ పూజ అని కూడా అంటారు. ఈ రోజున గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలతో చేసిన ఆహారాన్ని, శెనగపిండితో చేసిన కూర, ఆకు కూరలను ఆహారంగా వండి శ్రీకృష్ణునికి నైవేద్యంగా పెడతారు.
గోవర్ధన పూజ రోజున గోవర్ధన పర్వతం, ఆవు , శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఈ పూజ ద్వారా సహజ వనరులకు గౌరవం ఇవ్వడం తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ఇంద్రుడిని ఓడించినందుకు గుర్తుగా గోవర్ధన పూజ జరుపుకుంటారు. గోవర్ధన పూజ ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా అందరికీ చెప్పాడని చెబుతారు.
ఈ రోజున గోవర్ధన పర్వతాన్ని పూజిస్తారు. ఈ రోజున ఆవులకు, ఎద్దులకు స్నానం చేయించి రంగులు వేసి వాటి మెడలో కొత్త తాడును కట్టారు. గోవర్ధన పూజ రోజున ఆవులకు, ఎద్దులకు బెల్లం, అన్నం కలిపి తినిపించాలి. అలాగే గోవర్ధన పూజ రోజున గోవులకు గడ్డిని ఆహారం ఇవ్వడం శుభప్రదమని నమ్మకం.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..