
హిందూ మతంలో మొత్తం 18 పురాణాలున్నాయి. వీటిలో ఒకటి గరుడ పురాణం. ఈ పురాణం ఒక వ్యక్తి చేసే కర్మలను.. వాటి ఆధారంగా అతను పొందే మంచి, చెడు ఫలితాలను గురించి చెబుతుంది. ఈ పురాణానికి అధిదేవత శ్రీ మహా విష్ణువు. అందువల్ల ఈ పురాణాన్ని వైష్ణవ పురాణం అని కూడా అంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో తాను చేసిన కర్మలకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతాడు. మనిషి చనిపోయిన తర్వాత కూడా తన కర్మల ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. గరుడ పురాణంలో కూడా ఇలాంటి కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. దీని కారణంగా ఒక వ్యక్తి తన మరణం గురించి ముందస్తు సూచన పొందుతాడు. ఆ సంకేతాలతో మనిషి తన మరణం దగ్గర పడిందని ముందుగానే గ్రహించడం మొదలు పెట్టాలట.
మరణించిన మనిషి ఆత్మ 13 రోజులు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతారు. అందుకే మరణించిన ఇంట్లో.. 13 రోజులు గరుడ పురాణం పారాయణం చేస్తారు. మరోవైపు గరుడ పురాణం ప్రకారం ఆ వ్యక్తికి తన మరణం గురించి ఇప్పటికే తెలుసు. గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి అయినా తన మరణాన్ని 6 నెలల ముందుగానే ఊహించగలడు. మరణం సమీపించిందనే లక్షణాలు వ్యక్తులకు కనిపిస్తాయి. ఒక వ్యక్తి మరణానికి ముందు సంకేతాలను పొందుతాడు. అందువల్ల రానున్న తన మరణాన్ని 6 నెలల ముందుగానే అంచనా వేయవచ్చు.
హిందూ మత గ్రంథాల ప్రకారం, ఒక వ్యక్తి మరణానికి ముందు అనేక రకాల సంకేతాలను పొందుతాడు. గరుడ పురాణంలో కూడా ఒక వ్యక్తి మరణానికి కొంత సమయం ముందు తన మరణాన్ని అంచనా వేయగల కొన్ని సంకేతాలను చూస్తాడని ప్రస్తావించబడింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు