Gangasagar Mela 2022: గంగాసాగర్ మేళాకు కోర్టు గ్రీన్ సిగ్నల్.. దీదీ ప్రభుత్వానికి కీలక సూచనలు..

|

Jan 07, 2022 | 5:38 PM

Gangasagar Mela 2022: మళ్ళీ కోవిడ్ కేసులతో  పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్న వేళ.. గంగాసాగర్ మేళా నిర్వహించడానికి  కోల్‌కతా హై కోర్టు శుక్రవారం కొన్ని షరతులతో..

Gangasagar Mela 2022: గంగాసాగర్ మేళాకు కోర్టు గ్రీన్ సిగ్నల్..  దీదీ ప్రభుత్వానికి కీలక సూచనలు..
Gangasagar Mela 2022
Follow us on

Gangasagar Mela 2022: మళ్ళీ కోవిడ్ కేసులతో  పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్న వేళ.. గంగాసాగర్ మేళా నిర్వహించడానికి  కోల్‌కతా హై కోర్టు శుక్రవారం కొన్ని షరతులతో కూడిన అనుమతినిచ్చింది. పశ్చిమ బెంగాల్ లోని ప్రతిపక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్,  రాష్ట్ర ప్రతినిధితో కూడిన ముగ్గుల సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కోర్టు సూచించిన చర్యలను పాటించేలా చూడడానికి ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది.

రాష్ట్రంలో మళ్ళీ COVID-19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గంగాసాగర్ మేళాపై నిషేధం విషయంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం  పరిశీలించాలని కోరిన నేపథ్యంలో.. కోర్టు తాజాగా తన తీర్పుని వెలువరించింది.  ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కోవిడ్ -19 , ఓమిక్రాన్ ముప్పును ప్రస్తావిస్తూ…  ఈ సంవత్సరం గంగాసాగర్ మేళాను నిలివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు బెంచ్ విచారించింది. ప్రతి సంవత్సరం గంగాసాగర్ మేళాకు భారీ సంఖ్యలో యాత్రికులు హాజరవుతారని, 18 లక్షల మంది యాత్రికులువస్తారని.. పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా, ఈ ఏడాది గంగా సాగర్ మేళాను నిషేధించాలన్న పిటిషనర్  అభ్యర్థనను రాష్ట్రం తీవ్రంగా పరిగణిస్తుందని.. ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందని  తాము భావిస్తున్నాం’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రకాశ్‌ శ్రీవాస్తవ, జస్టిస్‌ కేడీ భూటియాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

మతపరమైన ఆచారాల కంటే జీవితం ముఖ్యం: హైకోర్టు  
మతపరమైన ఆచారాలు, విశ్వాసాల కంటే ప్రాణం ముఖ్యమని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తుంచుకోవాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఓ వైపు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోంది. మరియు గత 24 గంటల్లో కేసుల సంఖ్య 50 శాతం పెరిగింది .. అంతేకాదు భారీ సంఖ్యలో వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ అంశాలను అన్నింటిని పరిగణలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం పేర్కొంది.

గంగాసాగర్ మేళా 2022 మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 8-16 వరకు జరగనుంది. కోల్‌కతాకు 130 కిలోమీటర్ల దూరంలోని సాగర్ ద్వీపంలో గంగాసాగర్ మేళా జరగనుంది. ఇదిలా ఉండగా..జనవరి 7న జరగాల్సిన 27వ కోల్ కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని వాయిదా వేసింది పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం.

Also Read: Cock Fight: అక్కడ కోడిపందాలు నిర్వహణకు కోర్టు అనుమతి.. ఈ కండిషన్స్ పాటించాల్సిందే..