హిందూ మతంలోని ప్రధాన పండుగలలో ఒకటైన వినాయక చవితిని జరుపుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గణపతి పుట్టిన రోజున అత్యంత వైభంగా జరుపుకుంటారు. చవితి రోజున విగ్రహం ఏర్పాటు చేసి పూజ చేయడంతో 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. గణేశుడు భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి రోజున జన్మించాడు. ఈ రోజుని వినాయక చవితిగా జరుపుకుంటారు. ఇప్పటికే గల్లీ గల్లీలో వినాయక చవితి సందడి మొదలైంది. గణపతి విగ్రహాన్ని మండపాల్లో ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. 10 రోజుల పాటు నియమాలతో పూజించిన తరువాత.. ఈ విగ్రహాన్ని అనంత చతుర్దశి రోజున ప్రవహిస్తున్న నదిలో నిమజ్జనం చేస్తారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 18న గణేష్ చతుర్థి జరుపుకోనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గణపతికి స్వాగతం పలికేందుకు సన్నాహాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు విభిన్నంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద మండపాలను ఏర్పాటు చేసి విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఈ మండపాల్లో కొలువుదీరిన గణపతిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.
గణపతి జ్ఞానం, ఆనందం, శ్రేయస్సు కారకుడు. గణపతిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు ఉంటాయి. 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాల సమయంలో గణపతి భూమిపైకి వచ్చి తన భక్తుల కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో వినాయకుడిని పూజించి ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక సన్నాహాలు చేస్తారు. ఈ సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే చవితి తిథి రెండు రోజులు వచ్చింది. ఈ తిథి సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12.39 గంటల నుంచి మొదలై.. సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో చాంద్రమాన ప్రకారం తెలుగువారు గణేష్ చతుర్థి పండుగను సెప్టెంబర్ 18 న జరుపుకోనున్నారు.
అయితే గణపతి ఆరాధన అన్ని దేవతల ఆరాధన కంటే భిన్నం.. వినాయక పూజ సమయంలో తప్పని సరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఇవి లేకుండా పూజ పూర్తి కాదు. ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం.
గణేశునికి దర్భ గడ్డి అంటే చాలా ఇష్టం. కనుక గణపతి పూజలో అదీ వినాయక చవితి రోజున చేసే పూజలో దర్భగడ్డి తప్పనిసరి. ఇది లేకుండా చేసే పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు. కనుక తప్పనిసరిగా వినాయక చవితికి దర్భగడ్డిని ఉపయోగించండి.
అంతేకాదు గణపతికి ఉండ్రాళ్లు, కుడుములు అంటే చాలా ఇష్టం. అందువల్ల.. గణపతి పూజ సమయంలో నైవేద్య సమర్పణలో ఖచ్చితంగా కుడుములు, ఉండ్రాళ్లు ఏర్పాటు చేయండి. వీటిని సమర్పించిన భక్తుల పట్ల గణపతి సంతోషంగా ఉండి,, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని విశ్వాసం,
గణేశుని పూజలో కూడా ఎర్రని పువ్వుల వాడకం చాలా ముఖ్యం. గణేశుడికి ఎర్రని పువ్వులు సమర్పించకుండా పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. కనుక మందారం, గులాబీ పువ్వులను తప్పనిసరిగా వినియోగించండి.
గణేశుడికి ఇష్టమైన అలంకారాల్లో సింధూరం కూడా ఒకటి. కనుక గణేశుడిని పూజించడానికి ముందు గణపతి విగ్రహానికి సింధూరం తిలకాన్ని దిద్దండి.
గణేశుడికి కూడా అరటిపండు సమర్పించండి.అరటి పండ్లు లేని గణపతి పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు.
గణపతి పూజలో సలిమిడి, వడపప్పు, పానకం తప్పనిసరి. వీటిని పూజా సమయంలో నైవేద్యంగా తప్పనిసరిగా గణపతికి సమర్పిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)