Ganesh Chaturthi: వినూత్న రీతిలో గణపతిపై భక్తిని చాటుకున్న ఉపాధ్యాయుడు.. చాక్పీస్, పెన్సిల్ పై గణపయ్య విగ్రహాలు

|

Sep 19, 2023 | 8:57 AM

కాటారం మండల కేంద్రానికి చెందిన ఈ ఉపాధ్యాయుడి పేరు రజనీకాంత్.. గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. చాక్పీస్, పెన్సిల్ పై వివిధ రూపాలు తయారు చేయడం ఇతని ప్రత్యేక కళ.. ఈ సూక్ష్మరూపకళతో వినాయకుడిపై తన భక్తి భావాన్ని చాటాడు.

Ganesh Chaturthi: వినూత్న రీతిలో గణపతిపై భక్తిని చాటుకున్న ఉపాధ్యాయుడు.. చాక్పీస్, పెన్సిల్ పై గణపయ్య విగ్రహాలు
Ganesha Idol On Chalk
Follow us on

వినాయక చవితి వచ్చిందంటే విభిన్న ఆకారాలు… అబ్బుర పర్చే అలంకరణతో గణేష్ మండపాలు దర్శనాలు ఇస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోరూపంలో గణపతిని తయారు చేసి ప్రతిష్టించి పూజలు చేయడం వినూత్న రూపంలో మండపాలు దర్శనమిస్తుంటాయి.

ఇదంతా కామన్ కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన కళా నైపుణ్యాoతో వినూత్నరీతిలో భక్తి భావాన్ని చాటాడు.. అత్యంత సూక్ష్మరూపంలో గణపతి ప్రతి రూపాలను వివిధ ఆకారాల్లో తయారుచేసి ఆ రూపాలకు రంగులది చూపాలని అబ్బురపరచాడు. కాటారం మండల కేంద్రానికి చెందిన ఈ ఉపాధ్యాయుడి పేరు రజనీకాంత్.. గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. చాక్పీస్, పెన్సిల్ పై వివిధ రూపాలు తయారు చేయడం ఇతని ప్రత్యేక కళ.. ఈ సూక్ష్మరూపకళతో వినాయకుడిపై తన భక్తి భావాన్ని చాటాడు.

వివిధ రూపాల్లో గణపతి ప్రతిరూపాలను చెక్కాడు.. ఒక్కో చాక్పీస్ పై ఇంచున్నర వైశాల్యంతో గణపతి విగ్రహాలను చెక్కి ఆ విగ్రహాలకు రంగులు వేశాడు.. ఈ ఉపాధ్యాయుడి కళా నైపుణ్యం ప్రతి ఒక్కరిని అబ్బురపరిచింది.

ఇవి కూడా చదవండి

వినాయక చవితి సందర్భంగా ఆరోజుంతా గణపతి నామస్మరణ చేస్తూ ఈ విధంగా చాక్పీస్ లపై గణపతి ప్రతిరూపలను చెక్కి తన భక్తిని చాటుకున్నాడు.. కొంతమంది వినాయక చవితి రోజు ఉపవాస దీక్షలు ఉంటూ గణపతి పూజలలో తరిస్తే… ఈయన ఉపవాస దీక్షతో గణపతి నామస్మరణ చేస్తూ చాక్పీస్ లు, పెన్సిల్ పై గణేష్ ప్రతిరూపాలను చెక్కి తన భక్తిని చాటుకున్నాడు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..