Andhra Pradesh: మగ బిడ్డ కావాలంటే కొబ్బరి మొక్క, ఆడ బిడ్డ కావాలంటే గులాబీ మొక్క.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?
పశ్చిమ గోదావరి జిల్లా శివదేవుని ఆలయంలో వింత ఆచారం ఆచరణలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా లోని ఈ శివాలయంలో మహా శివరాత్రి వచ్చిందంటే చాలు సంతానం లేని దంపతులు కొబ్బరి మొక్కలతో స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తుతారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీపార్వతీ సమేత శివదేవ స్వామివారి...
ఏలూరు, సెప్టెంబర్ 19: నవదంపతులు మగ సంతానం కాలనుకుంటున్నారా, మగ బిడ్డకు కొబ్బరి మొక్క, ఆడ బిడ్డకు గులాబీ మొక్క ఆగుడిలో నాటితే చాలు కోరుకున్న సంతానం కలుగుతుందట. ఇది స్ధానికులు విశ్వాసం. ప్రతియేటా ఈ మొక్కులు నాటే తంతు ఆ గ్రామంలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇంతకీ ఏంటీ వింత ఆచారం.? అసలు ఎక్కడ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.? లాంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
పశ్చిమ గోదావరి జిల్లా శివదేవుని ఆలయంలో వింత ఆచారం ఆచరణలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా లోని ఈ శివాలయంలో మహా శివరాత్రి వచ్చిందంటే చాలు సంతానం లేని దంపతులు కొబ్బరి మొక్కలతో స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తుతారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీపార్వతీ సమేత శివదేవ స్వామివారి ఆలయానికి వెళ్తే భక్తులు మొక్కలు నాటుతూ కనిపిస్తారు. ఇదేదో పర్యావరణ పరిరక్షణ కోసం వీరు చేస్తున్న మంచి పని అనుకుంటే పొరపాటే. కొబ్బరి మొక్క నాటితే మగబిడ్డ,గులాబీ మొక్క నాటితే ఆడబిడ్డ పుడతారనేది ఇక్కడి భక్తుల విశ్వాసం. ముఖ్యంగా మహాశివరాత్రి వచ్చిందంటే ఆలయ ప్రాంగణమంతా మొక్కలతో కళకల్లాడుతుంది.
ఈ ఆచారం ఇప్పటిది కాదని, త్రేతాయుగం నుంచీ ఉందని ఈ ఆలయ ప్రధాన అర్చకులు శివాజీ శర్మ చెబుతున్నారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని స్వయంగా ఆంజనేయ స్వామే ప్రతిష్టించారన్నారు. సంతానం లేని దంపతులు మహాశివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేసి ఆలయంలో కొబ్బరి మొక్కలను నాటడం, ఆడ పిల్ల కావాలంటే గులాబీ మొక్క నాటడం తరతరాలుగా వస్తున్న ఆచారమని పేర్కొన్నారు. సంతానం కలిగిన భక్తులు కూడా తమ పిల్లలతో శివరాత్రి రోజున ఆలయాన్ని దర్శించుకుంటారన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు శివరాత్రి రోజున మగబిడ్డ కోసం కొబ్బరి మొక్కను, ఆడబిడ్డ కోసం గులాబీ మొక్కలను నాటుతూ శివుడిని పూజిస్తారు.
త్రేతా యుగంలో రాముల వారు రావణాసురుని సంహారించిన దోష నివారనార్థం శత కోటి లింగాల ప్రతిష్ట లో బాగంగా ఇక్కడ శివ లింగాన్ని ప్రతిష్టించారని స్వయంగా ఆంజనేయుడు ఈ లింగాన్ని ఈ గ్రామంలో ప్రతిష్టించారని, చిక్కంలో వెలసిన స్వామి కాబట్టి శివ దేవుని చిక్కాల గ్రామంగా ఈ గ్రామానికి పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. ఎవరైతే దంపతులకు పిల్లలు పుట్టారని డాక్టర్లు సర్టిఫై చేస్తారో వారికి కూడా ఎక్కడ స్వామికి పూజలు చేసి మొక్క నాటితే సంతానం కలిగిందని తరతరాలుగా కొన్ని లక్షల మంది ఈ ఆలయంలో మొక్కలు నాటి సంతానం పొందడం గాక కొబ్బరి చెట్టు నాటి మగ సంతానం గులాబీ చెట్టు నాటి ఆడ సంతానము పొందాలని ఆలయ ప్రధానార్చకుడు శివాజీ శర్మ చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..