Vinayaka Chaviti: మనదేశంలో 5 ప్రసిద్ధి దేవాలయాలు.. వినాయక చవితిరోజున వీటిని దర్శించుకునే శుభఫలితాలు

|

Aug 30, 2022 | 1:35 PM

జీవితంలో తాము చేపట్టే పనుల్లో శుభకార్యాల్లో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా కష్టాలు లేకుండా చూడమని బొజ్జ గణపయ్యను పూజిస్తారు. వినాయకుడి పుట్టిన రోజుని అంగరంగ వైభంగా పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తారు.

Vinayaka Chaviti: మనదేశంలో 5 ప్రసిద్ధి దేవాలయాలు.. వినాయక చవితిరోజున వీటిని దర్శించుకునే శుభఫలితాలు
Lord Ganesha Temples
Follow us on

Vinayaka Chaviti: భారతదేశంలో పండుగల సీజన్ ప్రారంభమైంది. వినాయక చవితి పండుగ సాధారణంగా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో వస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 31, 2022న వినాయక పర్వదినం జరుపుకోనున్నారు. గణేశోత్సవం అని కూడా పిలువబడే వినాయక చతుర్థి.. అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది. పండుగ చివరి రోజున గణేష్ నిమజ్జనం చేస్తారు. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 9 న జరపనున్నారు. మీరు వినాయక చవితి రోజున భారతదేశంలో సందర్శించడానికి 5 ప్రసిద్ధ గణేష్ ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.

ముంబై: సిద్ధివినాయక దేవాలయం

ముంబైలోని అత్యంత ప్రసిద్ధ గణేష్ దేవాలయాలలో ఒకటి  సిద్ధివినాయక దేవాలయం. సామాన్యుల తోపాటు సెలబ్రెటీలు , ప్రముఖులు  ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.  ఆపిల్ CEO టిమ్ కుక్, సిద్ధివినాయక ఆలయ సందర్శనతో తన భారతదేశ పర్యటనను ప్రారంభించారు. ఇక్కడి దేవుడిని నవాసాచ గణపతి అని కూడా పిలుస్తారు. అంటే ఎవరైనా నిజంగా ఏదైనా కోరుకుంటే అది తీరుతుంది.

ఇవి కూడా చదవండి

పూణే: దగ్దుషేత్ హల్వాయి గణపతి దేవాలయం

పూణేలో ఉన్న ఈ 130 ఏళ్ల నాటి ఆలయం దగ్దుషేత్ హల్వాయి గణపతి దేవాలయం. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.  చరిత్ర ప్రకారం నంద్‌గావ్‌కు చెందిన వ్యాపారి ..  స్వీట్ మేకర్ శ్రీమంత్ దగదుషేత్ హల్వాయి తన భార్య లక్ష్మీబాయి పూణేలో స్థిరపడ్డారు.  స్వీట్ షాప్ యజమాని దగ్దుసేత్, ప్లేగు వ్యాధితో కోల్పోయిన తన కొడుకు జ్ఞాపకార్థం నిర్మించిన ఆలయం దగదుషేత్ హల్వాయి గణపతి దేవాలయం. ప్రతి సంవత్సరం, గణపతి పండుగను అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు.బాలగంగాధర తిలక్ ఈ గణపతి మందిరం ఆవరణలో గణేష్ చతుర్థిని ప్రజా పండుగగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు ఇక్కడే సామూహిక గణేష్ చతుర్థి వేడుకలు మొదలయ్యాయి.

జైపూర్: మోతీ దుంగ్రి గణేష్ ఆలయం 

1761లో నిర్మించిన ఈ ఆలయానికి 250 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. కోటలు, కొండలతో చుట్టుముట్టబడి జైపూర్ పురాతన దేవాలయాలలో ఒకటి. నివేదికల ప్రకారం.. గణేశ విగ్రహం సుమారు 500 సంవత్సరాల నాటిదని.. ఉదయపూర్ నుండి తీసుకురాబడింది. ఆలయంలో శివలింగం కూడా ఉంది. మహాశివరాత్రి రోజున భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శిస్తారు. సింధూర రంగులో ఉండే గణేశ విగ్రహం తొండం కుడివైపు ఉంటుంది.

చెన్నై: వరసిద్ధి వినాయగర్ ఆలయం

తమిళనాడు రాజధానిలోని చెన్నైలోని బీసెంట్ నగర్‌లో ఉన్న ఐకానిక్ ఆలయం గణేశ దేవాలయం. ప్రతి సంవత్సరం, గణేష్ చతుర్థి సందర్భంగా గొప్ప వేడుకలు జరుగుతాయి. ఆలయం సంగీత కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. పేదలకు ఆహారం ఇవ్వడం వంటి సామాజిక కార్యక్రమాలను కూడా ఆలయం చేపడుతుంది.

కేరళ: కలమస్సేరి మహాగణపతి దేవాలయం

ఈ ఆలయంలో గణేశుడు, సుబ్రమణ్యుడు, నవగ్రహాలు, శివుడు, పార్వతి, రాముడు వంటి ఇతర హిందూ దేవతలున్నాయి. ఈ ఆలయాన్ని 1980లలో కలమస్సేరి ఎన్ రఘునాథ మీనన్ నిర్మించారు. ఈ ఆలయం మలయాళ క్యాలెండర్ ప్రకారం కర్కిడకోమ్ నెల మొదటి రోజున ఆనయూట్టును నిర్వహిస్తారు. గజపూజ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, భక్తులు ఏనుగులను గణేశుడి అవతారంగా పేర్కొంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..