వారంలోని ప్రతి రోజు హిందూ మతంలో ఏదొక దేవీదేవతలకు అంకితం చేయబడింది. వారంలోని ఒకొక్క రోజు ఒకొక్క ఒక నిర్దిష్ట దేవుడిని పూజిస్తారు. సోమవారం శివుడి, మంగళవారం హనుమంతుడికి, బుధవారం వినాయకుడికి, ఇలా ప్రతి రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఆ దేవుళ్లను అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవి, సంతోషిమాత, దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఈరోజున అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఈరోజు శుక్రవారం సంతోషిమాత పూజ విధానం.. ఉద్యాపన గురించి తెలుసుకుందాం..
సంతోషి దేవత దుర్గా దేవి అవతారం అని విశ్వాసం. ఆనందం, సంతృప్తికి సంతోషిమాత అధిదేవతగా పరిగణిస్తారు. హిందూ సనాతన ధర్మంలో సంతోషిమాత పూజకు విశిష్ట స్థానం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాలలోని వారు శుక్రవారం సంతోషి మాతను పూజిస్తారు. ఉపవాసాన్ని పాటిస్తారు. సంతోషి మాత వ్రతాన్ని వరుసగా 16 శుక్రవారాలు చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతోషిమాత అనుగ్రహం పొందవచ్చు. ఇలా సంతోషిమాత మాత వ్రతం చేయడం వలన భక్తులకు సుఖ సంపదలను ఇస్తుందని.. కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు వెల్లువేరుస్తాయని నమ్మకం. 16 శుక్రవారాలు సంతోషిమాత వ్రతం, ఉపవాసం కుటుంబంలోని ప్రతి సభ్యుని శ్రేయస్సు కోసం ఉద్దేశించబడింది. ఈరోజు ఉపవాస దీక్ష గురించి తెలుసుకుందాం..
16 శుక్రవారం ఉపవాసం ఎలా పాటించాలంటే?
సంతోషి మాత వ్రత ఉద్యాపన:
మీరు వరుసగా 16 శుక్రవారాలు ఉపవాసం పాటిస్తూ.. సంతోషి మాత పూజను ముగించిన తర్వాత.. ఉద్యాపనను చేయాలి. 16 శుక్రవారం ఎనిమిది మంది ఆడపిల్లలను అమ్మవారి స్వరూపంగా భావించి భోజనం పెట్టాలి. వ్రతాన్ని ముగించాలి. ఇలా సంతోషిమాత వ్రతం ఆచరించే సమయంలో పుల్లని రుచికి.. ఆహారానికి దూరంగా ఉండాలి. ఎవరికీ పుల్లని ఆహారాన్ని అందించకూడదు. రుచిలో పుల్లని ఆహారాన్ని తినకూడదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)