Vastu Tips: ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులు వెంటాడుతున్నాయా..? ఇంట్లో ఈ వాస్తు దోషాలు లేకుండా చూస్తే చాలు.. సమస్యలకు చెక్..

|

Mar 06, 2023 | 6:30 AM

చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా చికాకుల నుంచి బయటపడొచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆర్థికపరమైన, అనారోగ్య ఇబ్బందుల్లో చిక్కుకోకుండా..

Vastu Tips: ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులు వెంటాడుతున్నాయా..? ఇంట్లో ఈ వాస్తు దోషాలు లేకుండా చూస్తే చాలు.. సమస్యలకు చెక్..
Vastu Tips
Follow us on

Vastu Tips: మనిషి జీవితాన్ని జాతకం, వాస్తు వంటివి ప్రభావితం చేస్తాయి. చాలా మంది జ్యోతిష్య పండితుల దగ్గర తమ జాతకాన్ని చూపించుకుంటారు. వారి సూచనల మేరకు పలు రకాల పరిహారాలు చేయించుకుంటారు. అదేవిధంగా వాస్తు కూడా ప్రభావితం చేస్తుందని, చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా చికాకుల నుంచి బయటపడొచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆర్థికపరమైన, అనారోగ్య ఇబ్బందుల్లో చిక్కుకోకుండా ఉండేందుకు, ఆనంద, విలాసమైన జీవితం గడిపేందుకు కొన్ని వాస్తు సూత్రాలు పాటించమని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అకల్ట్ సైన్స్ వాస్తు నిపుణుడు అంకుష్ మనోహర్ జిచ్కర్ సూచిస్తున్నారు. మరి ఆయన ఎటువంటి వాస్తు సూచనలను అందిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  • బ్రహ్మస్థానం: వాస్తుశాస్త్రం  ప్రకారం బ్రహ్మస్థానం అనేది ఇల్లు, కార్యాలయాల నిర్మాణాలలో కేంద్ర బిందువు లాంటిది. బ్రహ్మస్థానంలో బరువులను అస్సలు ఉంచకూడదు. ఇంకా ఈ ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడం మంచిది.
  • ఆగ్నేయ దిశ: ఆగ్నేయ దిశకు అధిపతిగా అగ్నికి కారకుడైన శుక్రుడని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అందుచేత ఈ దిశలో అగ్ని సంబంధమైన వస్తువులు, పరికరాలు ఉండటం మంచింది. ఆ దిక్కున వంటగది కూడా ఉండవచ్చు. అగ్నికి వ్యతిరేకమైన నీరు, గాలి మూలకాలు ఉండకుండా చూసుకోవాలి. అవి ఉంటే ఆర్థిక సమస్యలకు కారణం అవ్వవచ్చు.
  • ఈశాన్య దిశ: వాస్తుశాస్త్రంలో ఈశాన్య దిశకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని అత్యంత శుభమైన ప్రదేశంగా భావిస్తారు. ఈశాన్యం అనేది జీవితకాల శ్రేయస్సు, ఆనందాన్ని ప్రసాదించే దిక్కుగా భావిస్తారు. అందుకే ఈ స్థానంలో ఎటువంటి బరువులు ఉంచరు. సింక్, టాయిలెట్, బాత్రూం వంటివి ఈ దిక్కులో ఉండకూడదు. ప్రవహించే నీరు ఉత్సాహానికి, సానుకూల దృక్పథానికి చిహ్నం.. కాబట్టి ఫౌంటేన్ లాంటిది ఉంటే మంచిదని, సుఖ, సంతోషాలతో ఉంటారని చెబుతున్నారు.
  • ఉత్తర దిశ: ఈ దిశ కుబేరునికి అంకితం చేయబడింది. డబ్బు, శ్రేయస్సుకు స్థానం. సింక్, బాత్రూమ్, టాయిలెట్ వంటివి ఈ స్థానానికి దూరంగా ఉండాలి.
  •  ప్రధాన ద్వారం: ఇంటికి ఇది ఎంతో కీలకం. ఎటువంటి శక్తి ప్రవాహమైన దీని గుండానే లోపలకు వస్తాయి. ప్రధాన ద్వారం సరైన దిశలో ఉన్నప్పుడే ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. చాలామంది తూర్పు, ఉత్తర ముఖంగా ప్రధాన ద్వారాలు ఉండేలా చూసుకుంటారు.
  •  వార్డ్‌రోబ్: ప్రస్తుత కాలంలో బీరువాల స్థానంలో వార్డ్ రోబ్‌లు వచ్చాయి. చాలామంది తమ వద్ద విలువైన సామగ్రిని ఇందులోనే ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఇవి ఏ దశలో ఉన్నది.. అన్నది ముఖ్యం. ఇంటికి దక్షిణ దిశలో వార్డ్ రోబ్ ఉంటే మంచిది. దాని తలుపు ఉత్తర దిశలో తెరుచుకునేలా ఉండాలి.

మరిన్నిఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి