Lord Ganesha: విఘ్నేశ్వరుడు.. హిందువులకు ముఖ్య దేవుడు.. పండగలకు, పంక్షన్లకు ఏ పని మొదలు పెట్టాలన్నా నిర్విఘ్నంగా జరగడానికి గణేషుడిని కోరుకుంటూ.. తొలి పూజలను నిర్వహిస్తారు. శివపార్వతుల తనయుడు వినాయకుడి జీవితం నుంచి మనుషులు ముఖ్యమైన విషయాలను ప్రేరణగా తీసుకోవాలి. వాటిని ఆచరిస్తూ.. మనిషి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.. ఈరోజు మనిషి నిత్య జీవితంలో వినాయకుడి నుంచి ప్రేరణగా తీసుకునే ముఖ్య విషయాలు ఏమిటో చూద్దాం..
లక్ష్య సాధనలో విధి నిర్వహణ ముందు:
పార్వతి దేవి పిండిబొమ్మకు ప్రాణం పోసి.. ఆ బాలుడిని కాపలా ఉంచి స్నానానికి వెళ్తుంది. ఆ సమయంలో పరమేశ్వరుడు లోపలి వెళ్ళబోతే అడ్డుకున్నాడు చిన్నారి బాలుడు. అప్పుడు శివుడు తన గురించి చెప్పి.. లోపలి వెళ్ళమన్నా.. గణేషుడు వినడు. తనకు తల్లి అప్పగించిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ..సాక్షాత్తూ శివుడే వచ్చినా… గణేషుడు తన ప్రాణాలు పోయినా విధి నిర్వహణను పూర్తి చేశాడు. ఈ గుణంతో మనిషి తెలుసుకోవాల్సింది.. ఒక పని మనకు ఎవరైనా అప్పగిస్తే.. కర్తవ్యనిర్వహణలో వెనుదిరగకూడదు. అప్పుడు మనిషి లక్ష్యసాధనలో, కెరీర్‌లో ముందుకు దూసుకెళ్తాడు.
ప్రపంచంలో తల్లిదండ్రులదే మొదటి స్థానం:
గణాధిపతిగా నియామకం కోసం తల్లిదండ్రులు శివ పార్వతులు తనయులకు గణేషుడు, కుమారస్వామిలకు ముల్లోకాల్లో ఉన్న పుణ్య క్షేత్రాలను చుట్టిరావాలని పరీక్ష పెడతారు. దీంతో కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై యాత్రలకు బయలు దేరగా.. గణేషుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతులనే దేవుళ్లుగా భావించి వారి చుట్టూ మూడు ప్రదక్షణాలతో ముల్లోకాల పుణ్యక్షేత్రాలను చుట్టివస్తాడు. గణాధిపతి అయ్యాడు. ఈ గుణం నుంచి ప్రస్తుత జనరేషన్ తెలుసుకోవాల్సింది.. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలని తెలుస్తోంది.
తప్పుచేసిన వారిని క్షమించే గుణం:
తనను చూసిన నవ్విన చంద్రుడిని క్షమించడంతో వినాయకుడు.. నుంచి మనిషి నేర్చుకోవాల్సింది.. తమను ఎగతాళి చేసేవారిని క్షమించే గుణం నేర్చుకోవాలి.
చేపట్టి పనిని పూర్తిచేయడం
వేద వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని వినాయకుడు గ్రంథంగా రాస్తున్న సమయంలో ఘంటం విరిగినా గ్రంధస్తం చేసే సమయంలో.. గణేషుడు తన దంతాల్లోంచి ఒక దాన్ని విరిచి గ్రంథం రాయడం పూర్తి చేశాడు. అంతేకాని మధ్యలో ఆగిపోలేదు. దీంతో మనిషి నేర్చుకోవాల్సింది.. ఏ పనిచేపట్టినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి. మధ్యలో ఆగకూడదు.
ఆత్మ గౌరవం:
ఒకసారి శ్రీమహావిష్ణువు ఇంట్లో జరిగే శుభ కార్యానికి దేవతలందరూ వెళ్తూ.. స్వర్గలోకానికి గణేషున్ని కాపలాగా ఉంచుతారు. దీనికి కారణం తన ఆకారమే అని గణేశుడికి తెలుస్తుంది. ఎలాగైనా దేవతలకు గుణపాఠం చెప్పాలనుకుని.. వారు వెళ్లే అన్నీ గుంతలు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు. మూషికం దేవతలు వెళ్లే దారిలో గుంతలు చేయడంతో.. ఆ గుంతల్లో దేవతల రథం దిగబడుతుంది. దీంతో ఎంతమంది దేవతలు కలిసినా ఆ రథాన్ని బయటకు తీయలేరు.. అటుగా వెళ్తున్న ఓ రైతును పిలిచి సహాయం చేయమంటారు. ఆ ఆవ్యక్తి.. గణేషున్ని ప్రార్థించి ఒక్క ఉదుటున గుంతలో దిగబడి ఉన్న రథాన్ని బయటకు లాగుతాడు. అప్పుడు దీనికి కారణం అవరోధాలను తొలగించే దైవం వినాయకుడిని ప్రార్ధించడమే అని చెప్పడంతో దేవతలకు తమ తప్పు తెలుస్తుంది. వినాయకుడి క్షమించమని కోరతారు. వినాయకుడు తన ఆత్మ గౌరవంతో ప్రవర్తించిన తీరు ఎట్టి పరిస్థితిలోనైనా ఆత్మ గౌరవాన్ని మనం కోల్పోకూడదని వినాయకుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
Also Read: Piles Ayurveda Tips: ఫైల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. నివారణకు ఆయుర్వేదంలో సింపుల్ చిట్కాలు..
Horoscope October 2021: ఈ నెలలో ఈ రాశివారికి స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలు.. ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..