Watch Video: ఇంద్రకీలాద్రిపై భక్తులకు తృటిలో తప్పిన రెండు ప్రమాదాలు.. ఘటనపై దర్యాప్తు..

| Edited By: Srikar T

Mar 10, 2024 | 9:24 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం తృటిలో తప్పింది. చెత్త కుప్పలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు వచ్చిన ఓ ఫైరింజన్ ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్ దిగుతూ ఉండగా, ఫైరింజిన్ బ్రేక్ ఫెయిలై ప్రమాదానికి గురైంది. భక్తులపైకి దూసుకెళుతుండగా.. అప్రమత్తమైన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి డివైడర్‎ను ఢీకొట్టారు. వాహనం ఆగిపోవడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

Watch Video: ఇంద్రకీలాద్రిపై భక్తులకు తృటిలో తప్పిన రెండు ప్రమాదాలు.. ఘటనపై దర్యాప్తు..
Indrakeeladri Temple
Follow us on

విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం తృటిలో తప్పింది. చెత్త కుప్పలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు వచ్చిన ఓ ఫైరింజన్ ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్ దిగుతూ ఉండగా, ఫైరింజిన్ బ్రేక్ ఫెయిలై ప్రమాదానికి గురైంది. భక్తులపైకి దూసుకెళుతుండగా.. అప్రమత్తమైన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి డివైడర్‎ను ఢీకొట్టారు. వాహనం ఆగిపోవడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం తప్పింది. ఇంద్రకీలాద్రి కొండ పైభాగాన ఉన్న చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైరింజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఆ వాహనం ఘాట్ రోడ్ దిగుతుండగా.. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.

అదే సమయంలో భక్తులతో కూడిన టెంపుల్ బస్సు ఎదురుగా వచ్చింది. ఇది గమనించిన ఫైరింజన్ డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. ఒక్కసారిగా కుడివైపున ఉన్న డివైడర్‎ను ఢీకొట్టాడు. దీంతో వాహనం ఆగిపోయింది. అటు భక్తులకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం కావడంతో భక్తులు వేలాదిగా వచ్చారు. ఘాట్ రోడ్ మీదుగా కొందరు కాలినడకన వస్తున్నారు. కొంతమంది వాహనాల్లో కొండపైకి ప్రయాణిస్తున్నారు. ఎలాంటి నష్టం జరుగకపోవడంతో అటు భక్తులు, ఇటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే.. ఊహకందని ఘోరం జరిగి ఉండేదని అని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రేక్ ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటి? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..