జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రంలో గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది మొత్తం 4 గ్రహణాలు రానుండగా, అందులో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. 2023లో ఏర్పడే తొలి గ్రహణం సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా సూతకం ఉండదు. ఈ సంవత్సరంలో రెండవ గ్రహణం చంద్ర గ్రహణం అవుతుంది. ఇది ఉప ఛాయ (పెనుంబ్రల్) చంద్ర గ్రహణం ఏర్పడనుంది. దీనిని చూడవచ్చు.
అనంతరం 2023 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం వార్షిక గ్రహణం అవుతుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కూడా కనిపించదు. దీని తర్వాత సంవత్సరంలో రెండవ, చివరి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం శరత్ పూర్ణిమ రోజున ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో చూడవచ్చు. సంవత్సరంలో ఏర్పడనున్న నాలుగు గ్రహణాల గురించి వివరంగా తెలుసుకుందాం.
మొదటి సూర్యగ్రహణం
2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడుతుంది. ఈ గ్రహణం అమావాస్య తిథి నాడు ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో చూడలేని కంకణాకృతి సూర్యుడు. భారతదేశంలో గ్రహణం కనిపించనందున.. సూతకం కాలం ఉండదు. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, అంటార్కిటికా, పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది.
మొదటి చంద్ర గ్రహణం
2023 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 5న ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం ఛాయా చంద్రగ్రహణం అవుతుంది. హిందూ సనాతన ధర్మంలో పెనుంబ్రల్ చంద్ర గ్రహణం గ్రహణంగా పరిగణించబడదు. ఇందులో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఈ చంద్రగ్రహణం యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలో కనిపిస్తుంది.
రెండవ సూర్యగ్రహణం
2023 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 14న కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ సూర్యగ్రహణం వార్షికంగా ఉంటుంది. భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి.. దీనికి మతపరమైన ప్రాముఖ్యత ఉండదు. అందుకే ఈ సూర్యగ్రహణానికి కూడా సూత కాలం చెల్లదు.
రెండవ చంద్ర గ్రహణం
సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం భారతదేశంలో చూడవచ్చు. అక్టోబర్ 28న ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణాన్ని భారతదేశంలోని అనేక ప్రదేశాలలో చూడవచ్చు. ఈ చంద్రగ్రహణ సమయంలో సూత కాలం ఉంటుంది. ఈ చంద్ర గ్రహణం అక్టోబర్ 28 రాత్రి 01.5 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఇది రాత్రి 02.24 నిమిషాలకు ముగుస్తుంది. భారత్‌తో పాటు యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర-దక్షిణ, ఆఫ్రికా, అంటార్కిటికా, పసిఫిక్ , హిందూ మహాసముద్రంలో ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..