సనాతన హిందూ ధర్మంలో ఆహారానికి సంబంధించి అనేక నియమాలను పేర్కొన్నారు. ఆహారం, ధాన్యాన్ని దేవతా స్వరూపంగా భావిస్తారు. అందుకనే తినే ఆహారం, ఆహారం తినే సమయం, కూర్చునే దిశ ఇలా అన్నింటికీ నియమాలు పెట్టారు. అయితే ఎక్కువ మంత్రి తాము ఆహారం తిన్న తర్వాత.. అదే ప్లేట్డి లో చేతులు కడుక్కుంటారు. అయితే ఇలా ఆహారం తిన్న ప్లేట్‌లో చేతులు కడుక్కోవడం అశుభం. ఇలా చేయడం వలన అన్నపూర్ణ దేవికి కోపం వచ్చి మొత్తం కుటుంబంపై చెడు ప్రభావం చూపుతుందని నమ్ముతారు. అన్నపూర్ణ దేవికి ఆగ్రహం కలిగితే ఆ ప్రభావం వ్యక్తి పై మాత్రమే కాదు ఆ కుటుంబంపై కూడా పడుతుంది. పేదరిక బారిన పడతారని శాస్త్రాల్లో చెప్పారు. ఈ రోజు మనం ఆహారాన్ని తినే సమయంలో ఉన్న కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం..
ఆహారం తినే ప్లేట్ లో పెట్టుకునే ఆహారం..
ఆహారం తినే సమయంలో మొట్ట మొదటిగా గుర్తుంచుకోవాల్సింది.. ఎంత తినగలరో అంతే ఆహారాన్ని ప్లేట్ లో పెట్టుకోవాలి. అంతేకాదు తినే ఆహారాన్ని ఎక్కువ పెట్టుకుని వృధా చేయడం వలన అన్నపూర్ణాదేవికి ఆగ్రహం కలుగుతుంది. అంతే కాదు.. తినే సమయంలో ఎక్కువగా ఆహారం పెట్టుకోవడం వలన చూసే వారికి కూడా ఇబ్బంది కరంగా మారుతుంది.
ఆహారాన్ని అగౌరవపరచడం మహా పాపం..
పురాణాల ప్రకారం ఆహారాన్ని అగౌరవపరచడం గొప్ప పాపంగా పరిగణించబడుతుంది. ఆహారాన్ని వృధా కాకుండా ఉండే విధంగా ప్లేట్‌లో ఆహారాన్ని పెట్టుకోవాలి. ప్లేట్‌లో ఆహారాన్ని వదలకూడదు. పళ్లెంలో భోజనం వదిలి పెట్టడం వలన అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ప్లేట్‌లో తింటూ తింటూ ఆహారం వదిలివేయడం చెడు అలవాటుగా మారుతుంది. ఇలా మళ్లీ మళ్లీ చేస్తారు.. తినే ఆహారం వృధా పడవేయడం లక్ష్మీదేవిని ఆగ్రహం కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో వింత సమస్యలు తలెత్తుతాయి.
తినే కంచంలో చేతులు కడుక్కోవడం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆహారం తిన్న తర్వాత అదే ప్లేట్ లో చేతులు కడుక్కోవడం వల్ల సంపదకు దేవత అయిన లక్ష్మి దేవి, ఆహార అధిదేవత అన్నపూర్ణ దేవికి కోపం తెప్పిస్తుంది. తిన్న తర్వాత ఎప్పుడూ తిన్న ప్లేట్ లో ఆహారం కడగకూడదని అంటారు. ఆహారంలోని ప్రతి మెతుకుని గౌరవించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంకా టీవీ9 తెలుగు దీన్ని దృవీకరించడంలేదు.