దేశమంతటా విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. దసరా పండగను కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకూ ఆ సేతు హిమాచలం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అనేక ప్రాంతాల్లో రాంలీలాను ప్రదర్శించి రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన రామలీలాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొన్నారు. వేదికపైకి వెళ్లే ముందు ప్రధాని మోడీ రాష్ట్రపతి రామ్-లక్ష్మణులకు పూజ చేసి హారతి ఇచ్చారు. ఆ తర్వాత ప్రధాని మోడీ వేదికపైకి చేరుకుని విల్లుని సంధించి బాణం విడిచి తద్వారా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేశారు.
మరోవైపు ఎర్రకోటలో నవ్‌శ్రీ ధార్మిక రామ్‌లీలా కమిటీ రామ్‌లీలాలో కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. ఢిల్లీలో రావణ దహనంతోనే దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో రాంలీలాను ప్రదర్శించి రావణుడి దిష్టిబొమ్మను దహనం చేశారు.
బీహార్ : ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పాట్నాలోని గాంధీ మైదాన్ చేరుకున్నారు. రాంలీలా ప్రదర్శనను చూసిన ఇరువురు నేతలు విల్లుని సంధించి బాణంతో రావణుడి దిష్టిబొమ్మను దహనం చేశారు.
జమ్మూకశ్మీర్: శ్రీనగర్‌లోని ఎస్‌కే స్టేడియంలో 30 అడుగుల ఎత్తున్న రావణుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. దిష్టిబొమ్మను దహనం చేసే సమయంలో భారీ సంఖ్యలో జనం ఉన్నారు. దీనికి ముందు రాంలీలాను ప్రదర్శించారు. జమ్మూలోని పరేడ్ గ్రౌండ్‌లో రావణుడి దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు.
ఉత్తరప్రదేశ్: విజయదశమి సందర్భంగా గోరఖ్‌పూర్‌లోని రాంలీలా మైదానంలో దసరా వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత పాత్రలు పోషిస్తున్న కళాకారుల నుదుటిపై తిలకం పెట్టారు.
#WATCH उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने गोरखपुर के रामलीला मैदान में दशहरा समारोह में भाग लेने के दौरान भगवान राम, लक्ष्मण और सीता की भूमिका निभाने वाले कलाकारों के माथे पर तिलक लगाया।#Dusshera pic.twitter.com/nvGtWQB3wy
— ANI_HindiNews (@AHindinews) October 12, 2024
ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఎర్రకోటలోని మాధవదాస్ పార్క్‌లో రావణుడు, మేఘనాథుడు, కుంభకరణ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రధాని మోడీ, రాష్ట్రపతి రావణుడి దిష్టిబొమ్మను విల్లుపై నుంచి బాణాలు ప్రయోగించి దహనం చేశారు.
#WATCH दिल्ली: राष्ट्रपति द्रौपदी मुर्मू और प्रधानमंत्री नरेंद्र मोदी की मौजूदगी में लाल किले के माधवदास पार्क में रावण, मेघनाद और कुंभकर्ण के पुतलों का दहन किया गया।
(सोर्स: डीडी न्यूज़) pic.twitter.com/38VEuuPGme
— ANI_HindiNews (@AHindinews) October 12, 2024
పశ్చిమ బెంగాల్: విజయదశమి సందర్భంగా బల్లిగంజ్ 21 పల్లి సర్బోజనిన్ దుర్గోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో సిందూర్ ఖేలా నిర్వహించారు. సిందూర్ ఖేలాలో మహిళలు పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా కోల్‌కతాలోనూ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
#WATCH कोलकाता, पश्चिम बंगाल: विजयदशमी के अवसर पर बालीगंज 21 पल्ली सर्बोजनिन दुर्गोत्सव समिति द्वारा सिन्दूर खेला का आयोजन किया गया। महिलाएं सिंन्दूर खेला में शामिल हुईं। pic.twitter.com/kvmewDxyWy
— ANI_HindiNews (@AHindinews) October 12, 2024
జార్ఖండ్: విజయదశమి సందర్భంగా రాంచీలో జరిగిన దసరా పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. అక్కడ రావణుడి దిష్టిబొమ్మను కూడా సీఎం దహనం చేశారు.
#WATCH झारखंड: विजयादशमी के अवसर पर रांची में दशहरा उत्सव का आयोजन किया गया।#DussehraCelebration pic.twitter.com/I58k84Qlsc
— ANI_HindiNews (@AHindinews) October 12, 2024
ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం విజయదశమి సందర్భంగా దేశప్రజలకు తన శుభాకాంక్షలను తెలియజేసారు. ఉన్నతమైన మానవ ఆశయాలపై మన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ పండుగ స్ఫూర్తినిస్తుందని అన్నారు. దసరా పండుగను విజయదశమి అని కూడా పిలుస్తారని.. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని చెప్పారు.
అదే సమయంలో ప్రధాని మోడీ దేశప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాదేవి, శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ జీవితంలోని ప్రతి అంశంలో విజయం సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..