Maa Lakshmi: కాసులు కురిపించే తల్లి ధనలక్ష్మి తల్లి. కానీ చంచల స్వభావం కలది. అందుకే ఎక్కడా నిలవదు. ఎవరైతే లక్ష్మీ అనుగ్రహం సాధిస్తారో వారి ఇంట్లో ఉంటుంది. దీపావళికి అందరు లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. అయితే తల్లి ఇంట్లో నిలావాలంటే కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఇలాంటి తప్పులు చేసే వారింట్లో అస్సలు ఉండదు. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
1. మురికి పాత్రలు ఉంచవద్దు
తరచుగా ప్రజలు ఇంట్లో మురికి పాత్రలను అలాగే వదిలేస్తారు. రాత్రి పూట తిన్న అంట్ల గిన్నెలను ఉదయాన్నే కడిగేస్తారు. కానీ అలా చేయడం సరికాదు. ఇంట్లో ఎప్పుడూ మురికి పాత్రలు ఉంచవద్దు. ఎప్పుడూ వంటగదిని శుభ్రం చేసి పడుకోవాలి.
2. పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచవద్దు
సంపదకు చిహ్నం లక్ష్మీ మాతా. అటువంటి పరిస్థితిలో చెత్త లేదా పనికిరాని వస్తువులను ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. ముఖ్యంగా ఉత్తరం వైపున అస్సలు ఉంచకూడదు.
3. స్టవ్ మీద పాత్రలను ఉంచవద్దు
వంటగదిలో పొయ్యి మీద ఖాళీ పాత్రలను ఎప్పుడూ ఉంచవద్దు. అది అశుభం. కిచెన్, స్టవ్ శుభ్రంగా ఉంచాలి. ఖాళీ పాత్రలను స్టవ్‌పై పెట్టకూడదు అలా చేస్తే ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది. లక్ష్మీ దేవికి నచ్చదు. ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడదు.
4. చీపురు
చీపురుని లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. అందుకే ఎవరికి కనిపించని ప్రదేశంలో ఉంచాలి. అంతేకాదు నిటారుగా ఎప్పుడు పెట్టకూడదు. చీకటి పడ్డాక చీపురుని ఉపయోగించరాదు.
5. చందనాన్ని చేతితో రుద్దకండి
గంధాన్ని ఎప్పుడూ ఒంటి చేత్తో రుద్దకూడదు. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. డబ్బు కరువును ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడిని పూజించే సమయంలో ఎల్లప్పుడూ చందనాన్ని ఒక పాత్రలో పెట్టుకోవాలి.