TTD: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా తరలివచ్చిన భక్తజనం

|

May 28, 2022 | 7:07 PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల(Tiruamala) లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. కరోనా(Corona) కారణంగా...

TTD: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా తరలివచ్చిన భక్తజనం
Tirumala Rush
Follow us on

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల(Tiruamala) లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. కరోనా(Corona) కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనంతగా వస్తున్న భక్తులతో శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. దీంతో టీటీడీ(TTD) ఈవో ధర్మారెడ్డి క్యూ లైన్లను పరిశీలించారు. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవలు జరిగే రోజుల్లోనూ ఇంత భక్తులు రాలేదని స్థానికులు చెబుతున్నారు. రోజురోజుకు తిరుమలలో భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రద్దీ కారణంగా మూడు రోజుల బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అనూహ్య రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర సమయాన్ని పునరాలోచించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వీఐపీలు తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు. పెళ్లిళ్ల సీజన్ కావడం.. విద్యార్థులకు సెలవు రోజులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు.

మరో వైపు తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడంతో గదులకు డిమాండ్‌ ఏర్పడింది. సీఆర్వో, ఎంబీసీ, గదుల రిజిస్ర్టేషన్‌ కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో గదిని పొందేందుకు దాదాపు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. మరోవైపు కల్యాణకట్టలు కూడా యాత్రికులతో కిక్కిరిసిపోయాయి. రెండేళ్లుగా పరిమిత సంఖ్యలోనే దర్శనాలకు అనుమతివ్వడంతో ఎప్పుడెప్పుడు తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటామా అని తపించిపోయారు భక్తులు. ఇప్పుడు కరోనా కాస్త తగ్గడం, సర్వదర్శనాలకు అనుమతివ్వడంతో కొండపై రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇక శ్రీవారి హుండీ ఆదాయం కూడా రికార్డ్‌ స్థాయిలో వస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి