Dream Theory
నిద్రపోతున్న ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఒక్కోసారి మధురమైన కలలు అయితే మరికొన్ని సార్లు భయంకరమైన కలలు వస్తాయి. కలలు రకరకాలుగా ఉంటాయి. జంతువులూ, పక్షులు, రకరకాల సన్నివేశాలు ఇలా ఎన్నో రకాల కలలు కనిపిస్తాయి. మరి ఈ కలలు కొన్నిసార్లు శుభకరమైనవి. కొన్నిసార్లు అశుభకరమైనవిగా నిరూపిస్తాయి. కొన్ని రకాల కలలు భవిష్యత్ కు సంకేతాలని స్వప్న శాస్త్రం పేర్కొంది. హిందూ గ్రంధాలలో కలల ప్రాముఖ్యత కూడా అపారమైనది. ఎందుకంటే వ్యక్తి భవిష్యత్తు ఈ కలతో ముడిపడి ఉంటాయని.. నిద్రలో కలలు కనే వివిధ స్థాయిలు ఉన్నాయని స్వప్న శాస్త్రాలు పేర్కొన్నాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు చాలా శుభప్రదమైనవి. ఆర్థిక లాభం, విజయం, ఆనందం , శ్రేయస్సు పొందే అవకాశం ఉందని ముందస్తు సూచన. కొన్నిసార్లు కలలు జీవిత చక్రాన్ని మార్చగలవు. ఏ కలలు అదృష్టాన్ని సూచిస్తాయో ఈ రోజు తెలుసుకుందాం..
- పుట్టిన ప్రతి జీవికి మరణం అనివార్యం. మరణం అంటే భయపడతారు కూడా.. అయితే కలలో మృత్యువు చూడటం శుభ ఫలితాలనిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం అటువంటి కల సమీప భవిష్యత్తులో లాభాలను సూచిస్తుంది. తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- కలలో చనిపోయిన వ్యక్తిని చూడటం వేర్వేరు అర్థాలను కలిగి ఉంటుంది. జీవించి ఉన్న వ్యక్తి కలలో చనిపోయినట్లు కనిపిస్తే.. ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవిస్తాడు.
- అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కలలో చనిపోయినట్లు కనిపిస్తే..అతని ఆరోగ్యంలో బాగుపడి మళ్ళీ ఆరోగ్యంగా జీవిస్తాడని నమ్మకం.
- మరణించిన పూర్వీకులు వచ్చి కలలో ఆశీస్సులు ఇస్తే జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, అదృష్టాలు తిరిగి వస్తాయి. ఇలాంటి కల వ్యక్తి భవిష్యత్తులో గొప్ప అవకాశాలను కూడా తెస్తుంది.
- మీరు కలలో బావి నుండి నీటిని తోడుతున్నట్లు కనిపిస్తే ఈ కల మీకు సంపద , శ్రేయస్సును తెస్తుంది. ఆదాయాన్ని కూడా పెరుగుతుందని విశ్వాసం.
- కలల శాస్త్రం ప్రకారం కలలో పచ్చని చెట్లు, తోటలను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది.
- చెట్టు నుండి పండ్లు కోసినట్లు కనిపిస్తే అది మరింత మంచిది. ఈ కల వల్ల మీ పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉందని స్వప్న శాస్త్రం పేర్కొంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు