Hindu Festivals: పండగలు, పర్వదినాల సమయంలో మహిళలు ఏ రంగు చీరలు ధరించాలి, ఏవి ధరించకూడదు అంటే..

|

Oct 10, 2022 | 6:31 PM

తమని తాము ప్రత్యేకంగా అలంకరించుకుని లక్ష్మీదేవిలా కనిపిస్తారు. అందంగా కనిపించేందుకు మహిళలు దుస్తులు, అలంకరణ, నగలు వంటి వాటిని ఉపయోగిస్తారు. అయితే సాధారణంగా ఎక్కువ మంది ఎరుపు రంగు దుస్తులను ధరిస్తారు.

Hindu Festivals: పండగలు, పర్వదినాల సమయంలో మహిళలు ఏ రంగు చీరలు ధరించాలి, ఏవి ధరించకూడదు అంటే..
Festival Celebrations
Follow us on

సనాతన హిందూ ధర్మంలో పండగలకు, పర్వదినాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయా కాలంలో వచ్చే పండగలు.. ఆయా సీజన్ కు అనుగుణంగా జరుపుకునే లా నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు పెద్దలు. అవును హిందూ మతంలో మహిళలకు సంవత్సరం పొడవునా ఏదొక పండుగ వస్తూనే ఉంటుంది. తమ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం.. ఆర్ధికాభివృద్ధి సుఖ సంపదల కోసం భార్యలు తమ భర్తల దీర్ఘాయువు కోసం పూజలు చేస్తారు. ఉపవాసం ఉంటారు. అందుకే  మహిళలకు పూజలు చాలా ప్రత్యేకం. పూజలు చేసే సమయంలో స్త్రీలు స్పెషల్ గా అలంకరించుకుంటారు. దుస్తులు, నగలు ధరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తమని తాము ప్రత్యేకంగా అలంకరించుకుని లక్ష్మీదేవిలా కనిపిస్తారు. అందంగా కనిపించేందుకు మహిళలు దుస్తులు, అలంకరణ, నగలు వంటి వాటిని ఉపయోగిస్తారు. అయితే సాధారణంగా ఎక్కువమంది ఎరుపు రంగు దుస్తులను ధరిస్తారు. అయితే కొందరు స్త్రీలు చీరల రంగును ఎంచుకునే విషయంలో పొరపాటు చేస్తారు. ఇలా చేయడం వలన పూజాఫలం దక్కడానికి బదులుగా హాని కలిగిస్తుంది. ఈ రోజున పండగలు, పర్వదినం సమయంలో ఎటువంటి రంగుల చీరలను ధరించకూడదో తెలుసుకుందాం..

నల్ల రంగు
హిందూ మతంలో, పండుగలు లేదా ఏదైనా మతపరమైన వేడుకల సమయంలో నలుపు రంగు వస్తువులను ఉపయోగించడం నిషేధించబడింది. ఈ కారణంగా  శుభకార్యాల సమయంలో లేదా పెద్ద పండుగలో నల్ల చీర లేదా అలాంటి బట్టలు ధరించడం మానుకోవాలి. ప్రత్యేకమైన రోజున ఈ రంగు చీరను ధరించడం అశుభం. శుభ కార్యాల్లో నలుపు రంగు ధరించకూడదని పెద్దలు చెబుతారు.

బ్రౌన్ కలర్
కొన్ని  పండగల సమయంలో గోధుమరంగు (బ్రౌన్ కలర్)  చీరలు కూడా ధరించకూడదు. గోధుమ రంగుపై రాహుకేతువు ప్రభావం ఉందని నమ్ముతారు. రాహుకేతువుల వల్ల దేవతలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితిలో.. మీరు కర్వా చౌత్ నాడు బ్రౌన్ కలర్ దుస్తులకు దూరంగా ఉండాలి. అట్లతద్ది, కార్వా చౌత్ వంటి ప్రత్యేక పండగల సందర్భంగా, వివాహిత స్త్రీలు గోధుమ రంగు దుస్తులకు దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

తెలుపు రంగు
కార్వా చౌత్ సందర్భంగా వివాహిత స్త్రీలు పొరపాటున కూడా తెల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. మీరు డిఫరెంట్‌గా కనిపించడం కోసం ఇలాంటి తప్పు చేస్తుంటే, మీరు పెద్ద తప్పు చేయబోతున్నారు. మతపరమైన దృక్కోణంలో.. తెలుపు రంగు ప్రయోజనానికి బదులుగా హాని కలిగించవచ్చు.

నీలి రంగు
నేవీ బ్లూ కలర్ దుస్తులకు కూడా దూరంగా ఉండాలి, ఈ రంగు కూడా పూజకు పవిత్రమైనదిగా పరిగణించబడదు. కానీ నేవీ బ్లూ కలర్ లేత నలుపుగా కనిపించేలా ముదురు రంగులో ఉంటుంది. కనుక అట్ల తద్ది.. లేదా కర్వా చౌత్ రోజున నేవీ బ్లూ కలర్ చీరలు లేదా దుస్తులు ధరించడం నిషేధించబడింది.

ఏయే రంగుల దుస్తులను ధరించవచ్చంటే.. 
పండగల రోజున మహిళలు ఎరుపు రంగు మాత్రమే కాకుండా ఆకుపచ్చ, పసుపు, గులాబీ, మెరూన్ కలర్ చీరలను ధరించవచ్చు. స్త్రీలు కావాలంటే ఈ రోజున ఆరెంజ్ అంటే నారింజ రంగు చీరలను కూడా ధరించవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)