
పూజ గదిలో పూర్వీకుల ఫోటోలు పెడుతున్నారా..? అయితే, వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో తప్పక తెలుసుకోండి. పితృ పక్షం ఇప్పుడే మొదలైంది. మీ పూజ గదిలో మీ పూర్వీకుల ఫోటోలు కూడా ఉంటే, వాటిని వీలైనంత త్వరగా తీసివేయండి. పూజ గదిలో పూర్వీకుల ఫోటోలను ఎందుకు ఉంచకూడదంటే.. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, పూర్వీకుల శక్తులను దైవిక ప్రకంపనలతో కలపడం వల్ల అసమతుల్యత ఏర్పడవచ్చునని అంటున్నారు. పూజా స్థలం సానుకూలత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
పూజ గది, పూర్వీకుల స్థలాన్ని వేరుగా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.. ఈ సమతుల్యత మీ ఇంట్లో దైవిక ఆశీర్వాదాలు, పూర్వీకుల అనుగ్రహం రెండింటినీ నిర్ధారిస్తుంది. అయితే, వాస్తు ప్రకారం, శాంతి, సామరస్యం కోసం మీ ఇల్లు లేదా గదిలో నైరుతి గోడపై పూర్వీకుల ఫోటోలను ఉంచుకోవచ్చునని చెబుతున్నారు. పితృ పక్షం వంటి ప్రత్యేక రోజులలో చెక్క లేదా ఇత్తడి ఫ్రేములతో ఫోటోలు చేయించుకోండి. ఫోటోలను శుభ్రంగా ఉంచండి. వాటి దగ్గర దీపం, ధూపం వెలిగించండి.
మీ పూజ గదిలో దైవిక ప్రకంపనలను నిర్వహించడానికి, ఆశీర్వాదాలను ఆకర్షించడానికి దేవతలు, ఆధ్యాత్మిక చిహ్నాలు, దివ్యలు, పువ్వులు ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..