AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2024: దీపావళి పండగ ఎప్పుడు.. అక్టోబర్‌ 31నా? నవంబర్‌ 1నా?

ఈ ఏడాది దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. కొంతమంది అక్టోబర్ 31 అంటే.. మరికొందరు మాత్రం నవంబర్ 1న అంటున్నారు. పండుతులు కూడా ఈ విషయంలో రెండుగా చీలిపోయారు. దీంతో దీపావళి విషయంలో జనాల్లో కూడా చాలా గందరగోళం నెలకొంది.

Diwali 2024: దీపావళి పండగ ఎప్పుడు.. అక్టోబర్‌ 31నా? నవంబర్‌ 1నా?
Diwali 2024 Date
Ram Naramaneni
|

Updated on: Oct 16, 2024 | 6:12 PM

Share

చీకట్లను పారదోలుతూ వెలుగులు నింపే పండుగ.. దీపావళి. విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగ రోజున ప్రతీ ఇల్లు దీప కాంతులతో వెలిగిపోతుంది. ప్రతీ ఇంటా లక్ష్మీ పూజ, బాణా సంచా మోతతో కలర్‌ఫుల్‌గా మారుతుంది. మరి అలాంటి దీపావళి ఎప్పుడు? అక్టోబర్‌ 31నా? నవంబర్‌ 1నా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

దీపావళి రోజున లక్ష్మీదేవి భూమిని దర్శించుకోవడానికి వస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది దీపావళి కచ్చితమైన డేట్ విషయంలో గందరగోళం నెలకొంది. నిజానికి దీపావళి ఆశ్వయుజ అమావాస్త రోజున వస్తుంది. దానికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. మరి.. ఆ తిథి ఎప్పుడు వచ్చిందనే దానిపై క్లారిటీ లేదు.

ఈసారి ఎందుకీ కన్ఫ్భూజన్? శాస్త్ర నియమాల ప్రకారం నవంబర్ 1న దీపావళిని జరుపుకోవాలంటున్నారు పండితులు. ఆ రోజున దిపావళిని జరుపుకోవడం శుభప్రదమని అంటున్నారు. ప్రదోష అమావాస్య అక్టోబర్‌ 31న.. నవంబర్‌ 1న.. ఈ రెండు డేట్‌లలో వస్తుంది. యాధృచ్చికంగా నవంబర్‌ 1న ఆయుష్మాన్ యోగం.. స్వాతి నక్షత్రం కలయిక జరిగింది. అందుకే దీపావళి నవంబర్‌ 1న జరుపుకోవాలంటున్నారు పండితులు.

ఇక వేద పంచాంగం ఏం చెబుతుందో తెలుసుకుందాం.. దీపావళి నాడు లక్ష్మీ పూజ అమావాస్య తిథి, ప్రదోష కాలాల్లో.. సూర్యాస్తమయం నుంచి అర్థరాత్రి వరకు జరుగుతుంది. ఈ లెక్కన అమావాస్య తిథి, ప్రదోషకాలం, శుభ సమయాలున్న అక్టోబర్ 31న దీపావళిని జరుపుకోవడం మంచిదంటున్నారు.

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథిన వైభవంగా జరుపుకుంటారు. ఆ రోజున గణేశుడు, సరస్వతి దేవి, కుబేరుడితో పాటు లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజిస్తారు. అయితే ఈసారి దీపావళి కచ్చితమైన తేదీ విషయంలో కన్ఫ్యూజన్‌ నెలకొంది. ఫైనల్‌గా ఏ డేట్‌ ఫిక్స్‌ అవుతుందన్నది చూడాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి