Komuravelli Mallanna Kalyanam: మల్లన్న కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లతో కొమురవెల్లి సందడిగా మారింది. కొమురవెల్లి మల్లన్న కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున దిష్టి కుంభం కార్యక్రమం వైభంగా జరిగింది. వీరశైవ ఆగమంలో భాగంగా మహా కుంభం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంతో కళ్యాణ వేడుక మొదలైంది. ఈ కార్యక్రమంలో ఈవో బాలాజీ, బార్శీ బృహన్మఠాధీశులు సిద్ధగురు మణికంఠ శివాచార్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొముర వెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణం ఇవాళ జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి ప్రాంతంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో మల్లన్న వీరశైవాగమశాస్త్రం ప్రకారం కేతలమ్మ, మేడాలదేవిలను వివాహమాడనున్నారు.
మార్గశిరమాసం చివరి ఆదివారం నిర్వహించే కళ్యాణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం తరపున మంత్రి హరీశ్‌రావు పట్టువస్ర్తాలు, తలంబ్రాలు అందజేయనున్నారు. కల్యాణానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టారు.
తోటబావి ప్రాంగణాన్ని గ్యాలరీలుగా విభజించి షామియానాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 7 గంటలకు కొమురవెల్లి మల్లన్న రథోత్సవం, రేపు ఉదయం 9 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు లక్షబిల్వార్చన, మహా మంగళహారతి నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి: New Year Recipe: న్యూ ఇయర్ వేడుకల్లో మోజారెల్లా స్టిక్స్ మీ కుటుంబ సభ్యులను ఖుష్ చేయండి.. వీటి ఇలా ట్రై చేయండి..
Trending Video: అయ్యో..! ఆపదలో పప్పి.. చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా..