ప్రస్తుతం ప్రతి ఒక్కరిదీ ఉరుకుల పరుగుల జీవితం..రణగొణధ్వనుల మధ్య ప్రకృతికి దూరంగా యాంత్రిక జీవితాన్ని గడిపేస్తున్నారు. దీంతో ఏ మాత్రం సమయం దొరికినా జనజీవనానికి ఉరుకుల, పరుగుల జీవితానికి దూరంగా ప్రకృతి దృశ్యాల మధ్య గడపాలని కోరుకుంటారు. నదులు, పర్వతాలను చూడడానికి ఇష్టపడతారు. అదే సమయంలో కొంతమంది నదులు, నదీతీరంలో ఉన్న ప్రదేశాలను సందర్శించాలని కోరుకుంటారు. నదుల సంగమంలోని ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంత లభిస్తున్నట్లు భావిస్తారు. అలంటి నదుల్లో ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగలో అలకనంద.. మందాకిని నదుల సంగమం.. ఈ రెండు నదుల కలయిక గురించి చాలా మందికి తెలుసు. ఈ ప్రదేశాలకు వెళ్ళిన పర్యాటకులు గొప్ప మానసిక ప్రశాంతతను పొందుతారు. అయితే రెండు కాదు మూడు నదులు కాదు.. ఏకంగా ఐదు నదుల సంగమం.. ఉన్న ప్రదేశం ఉందని మీకు తెలుసా..!
ఉత్తరప్రదేశ్‌లోని రుద్రప్రయాగలో.. అలకనంద, మందాకినీ రెండు నదుల సంగమం. ఇక ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి మూడు నదుల సంగమం ఉంది. దీంతో ఈ ప్రదేశాలు అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా వాటి సొంత వైభవాన్ని, గుర్తింపుని తెచ్చుకున్నాయి. అయితే ఇదే ఉత్తరప్రదేశ్‌లో ఐదు నదుల సంగమం ఉన్న ఒకే ఒక ప్రదేశం ఉంది. ఇక్కడ కంటికి మనసుకు హాయిని కలిగించే ఐదు నదుల సంగమాన్ని చూడవచ్చు.
ఉత్తరప్రదేశ్ లోని జలౌన్
ఐదు నదుల సంగమం గురించి మాట్లాడితే.. ఈ అందమైన ప్రదేశం ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో ఔరయ్యా.. ఇటావా సరిహద్దులో ఉంది. ఐదు నదుల సంగమం కారణంగా ఈ ప్రాంతాన్ని పంచనాద్ అని పిలుస్తారు. హిందూ మతపరమైన దృక్కోణంలో ఈ ప్రదేశం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని మహా తీర్థరాజ్ అని కూడా పిలుస్తారు.
ఐదు నదుల సంగమం
పంచనాద్‌లో యమునా, చంబల్, సిందు, పహాజ్, కున్వారీ నదుల సంగమం జరుగుతుంది. ఈ ప్రదేశానికి అధ్యత్మికంగానే కాదు.. చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. మహాభారత కాలంలో పాండవులు వనవాసం చేసిన ప్రదేశం ఇదేనని చెబుతారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ సంగమం దగ్గర ముచుకుంద మహారాజ్ ఆలయం కూడా ఉంది.
ప్రపంచంలోని ఏకైక ప్రదేశం
పంచనాద్ ప్రదేశం ప్రపంచంలోనే వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ప్రపంచంలో ఐదు నదులు కలిసే పవిత్రమైన ప్రదేశం. ఎవరైనా ప్రకృతికి దగ్గరగా సహజ ప్రదేశాలను దగ్గరగా చూసి ఎంజాయ్ చేయాలనుకున్నా.. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకున్నా పంచ నదుల సంగమం పంచనాద్ బెస్ట్ ఎంపిక.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..