Dhanurmasa: నేడు తిరుప్పావై 10వ రోజు.. ఈరోజు పాశురం విన్నవారికి కష్టాలు తీరునని భక్తుల నమ్మకం..

|

Dec 25, 2021 | 6:24 AM

Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు పదవ రోజు. గోదాదేవి ధనుర్మాసంలో  రంగనాధుడిని భర్తగా పొందడానికి వ్రతమాచరిస్తూ.. పాడిన పాశురాలలో ఈ రోజు తిరుప్పావై పదవ పాశురం..

Dhanurmasa: నేడు తిరుప్పావై 10వ రోజు.. ఈరోజు పాశురం విన్నవారికి కష్టాలు తీరునని భక్తుల నమ్మకం..
Pasuram Day 10
Follow us on

Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు పదవ రోజు. గోదాదేవి ధనుర్మాసంలో  రంగనాధుడిని భర్తగా పొందడానికి వ్రతమాచరిస్తూ.. పాడిన పాశురాలలో ఈ రోజు తిరుప్పావై పదవ పాశురం. ఈ పది పాశురం వరకూ గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి.  ఒక్కొక్క రోజు ఒక్కొక్క‌ వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. ఈరోజు మరో గోపికను నిద్ర లేపుతూ.. నీవు మంచినోము నోచి, స్వర్గఫలాన్ని అందుకున్నావు. గొల్లభామలందు గొప్పదానివి.. నువ్వు త్వరగాలే.. మాతో వచ్చి ఆ చిన్ని కన్నయ్య ని కూడా లేపాలి అంటూ గోదాదేవి, మిగిలిన గోపిలాల్తో కలిసి నిద్ర లేపుతుంది. ఈ ధనుర్మాసం నెల రోజులూ విష్ణువుని స్తుతిస్తూ.. ప్రతి దినం గోదాదేవి రచించిన పాశురాలను వైష్ణవాలయాల్లో పాడతారు. ఈరోజు ధనుర్మాసంలో పదవ రోజు ..ఈరోజు  పాశుర‌ము, దాని అర్ధం తెలుసుకుందాం..

పదవ పాశురం:

నోట్రుచ్చువర్కమ్ పుహిగిన్రవమ్మనాయ్
మాట్రముమ్ తారారో వాశల్ తిరవాదార్
నాట్రత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోట్రప్పరైత్తరుమ్ పుణ్ణియనాల్,పణ్ణొరునాళ్,
కూట్రత్తిన్ వాయ్ విళన్ద కుమ్బకరుణనుమ్
తోట్రు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?
ఆట్రవనన్దలుడై యా యరుంగలమే
తేట్రమాయ్ వన్దు తిరవేలో రెమ్బావాయ్

అర్ధం : ఇంకొక గోపిక ముందుగానే నోమునోచినది. సుఖానుభవం పొందుతుంది. తలుపులు తెరవకపోయినా మాతో మాట్లాడవచ్చు కదా.. కుంభకర్ణుడు తన సొత్తు అయిన గాఢనిద్రను నీకు కప్పంగా ఇచ్చాడా? గాఢ నిద్ర మత్తు వదులు, మైకము వీడు అని గోపికను మందిలిస్తుంది గోదా. తులసీమాలల అలంకరణతో, కిరీటంగల నారాయణుడు, పుణ్యస్వరూపుడు అయిన కృష్ణుణ్ణి మంగళాశాసనములు పాడిన ‘పరయను వాయిద్యమును మనకి చ్చును. మా అందరికి మణిరత్నం లాంటి దానివి అంటూ గోపికను పొగుడుతూ.. త్వరగా వచ్చి తలుపు తీయమ్మా అంటూ గోదాదేవి, మిగిలిన గోపికలు లోపల నిద్రలో ఉన్న గోపికను కోరుతున్నారు. ఈ పాశురం విన్నంతనే అన్ని కష్టాలు తీరతాయని పెద్దల విశ్వాసం

Also Read:

బాప్‌రే ఇంత డిమాండా?.. 55 నిమిషాల్లో 4.60 లక్షల టికెట్ల బుకింగ్..!

 శ్రీవారి భక్తులకు ఝలక్.. సర్వదర్శనం టోకెన్ల జారీపై టీటీడీ మల్లగుల్లాలు.. కారణమిదేనా..?