హిందూ మతంలో ప్రతి మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దాదాపు ప్రతి నెలలో ఏదొక పండుగ వస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి . ఈ దీపావళి పండగను అనేక ప్రాంతాల్లో ఐదు రోజులు జరుపుకుంటారు, ఇందులో ధన త్రయోదశి కూడా ఒకటి. ధన త్రయోదశి పండుగతో దీపాల పండుగ ప్రారంభమవుతుంది. ఈ దీపాల పండుగ 5 రోజుల పాటు జరుగుతుంది. వేద క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి రోజున ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఎవరైతే ధన్వంతరిని హృదయపూర్వకంగా ఆరాధిస్తారో.. వారి ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం ఉంటుందని మత విశ్వాసం.
ధన త్రయోదశి రోజున బంగారం లేదా వెండి, లక్ష్మీగణేశుడి విగ్రహాలు, పాత్రలు, చీపుర్లు, ధనియాలు మొదలైన వాటిని కొనుగోలు చేయాలి. ఈ రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం ద్వారా ధన్వంతరి , లక్ష్మీ దేవి ఆశీస్సులు వ్యక్తిపై ఎల్లప్పుడూ ఉంటాయని ఒక మత విశ్వాసం. అలాగే డబ్బుకు కొరత ఎప్పుడూ ఉండదని నమ్మకం .
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)