Srikalahasti: చిత్తూరు జిల్లా(Chittoor District)లో సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. దక్షిణ కాశీ(South Kasi)గా ఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో రాహు కేతు పూజ(Rahu Ketu Puja) లకు ప్రసిద్ధి. సోమవారం కావడంతో సర్ప దోశ నివారణ పూజల కోసం భక్తులు పోటెత్తారు. దీంతో నాగపడగల కొరత ఏర్పడింది. రాహు కేతు పూజలకు అంతరాయం కలిగింది. రాహు కేతు పూజ కోసం క్షేత్రానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయ అధికారుల తీరు సరిగ్గా లేదని.. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పరచడంలో విఫలమయ్యారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు ఆగ్రహించడంతో ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు హుటాహుటిన మింటును సందర్శించారు.
ఆలయంలోని మిషనరీ రిపేర్ కి వచ్చిందని.. మరోవైపు ఆలయ సిబ్బంది 10 మందిలో నలుగురికీ అనారోగ్యం కలిగిందని.. దీంతో సిబ్బందికి ఏర్పడినట్లు ఛైర్మన్ శ్రీనివాసులు గుర్తించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని.. తక్షణమే మరో 2 కొత్త మిషన్ల కొనుగోలు చేస్తామని.. అదనంగా మరో 5 మంది సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ఇక నుంచి రాహు కేతు పూజల కోసం వచ్చే భక్తులకు నాగపడగల కొరత లేకుండా చూస్తాం శ్రీకాళహస్తి ఆలయచైర్మన్ అంజూరు శ్రీనివాసులు చెప్పారు.
Also Read:
Janasena Party Formation Day Live: తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం జన సభ!
కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల మూసివేతకు నిరసనగా స్థానికుల సంతకాల ప్రచారం..(ఫొటోస్ )