Mallanna Temple: మల్లన్న ఆలయానికి బంగారు నాగాభరణం విరాళం.. నేటి నుంచి ఐదు రోజులు స్పర్శ దర్శనం నిలిపివేత

ఒడిస్సా రాష్ట్రం రాయఘడ్ జిల్లా గుణుపూరుకు చెందిన గోపాలరావు అనే భక్తుడు దేవస్థానానికి ఎర్రరాళ్ళు పొదిగిన బంగారు నాగాభరణాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ నాగాభరణం 45 గ్రాములు ఉంది. మరోవైపు నేటి నుండి ఈనెల 19 వరకు 5 రోజులపాటు శ్రీశైలంలో శ్రీస్వామివారి స్పర్శ దర్శనం నిలుపుదల జేశారు. భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిని ఇస్తున్నారు.  శ్రావణమాసం వరుస సెలవులు రావడంతో మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.

Mallanna Temple: మల్లన్న ఆలయానికి బంగారు నాగాభరణం విరాళం.. నేటి నుంచి ఐదు రోజులు స్పర్శ దర్శనం నిలిపివేత
Mallanna Temple

Edited By:

Updated on: Aug 15, 2024 | 9:39 AM

నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. మల్లన్నను దర్శించుకున్న ఓ భక్తుడు భూరి విరాళం ఇచ్చాడు. మల్లన్న దేవస్థానానికి ఒడిషా రాష్ట్రానికి చెందిన భక్తుడు బంగారు నాగాభరణం విరాళంగా సమర్పించాడు. ఒడిస్సా రాష్ట్రం రాయఘడ్ జిల్లా గుణుపూరుకు చెందిన గోపాలరావు అనే భక్తుడు దేవస్థానానికి ఎర్రరాళ్ళు పొదిగిన బంగారు నాగాభరణాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ నాగాభరణం 45 గ్రాములు ఉంది. ఈ నాగాభరణాన్ని అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచనమండపంలో భక్తుడు గోపాలరావు అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు, పర్యవేక్షకులు అయ్యన్న, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టరు కె.మల్లికార్జునకు అందజేశారు . అనంతరం బంగారు నాగాభరణం విరాళాల భక్తుడికి అధికారులు దేవస్థానం రశీదు అందజేశారు.  వేదాశీర్వచనముతో శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, లడ్డు ప్రసాదాలు అందజేశారు.

మరోవైపు నేటి నుండి ఈనెల 19 వరకు 5 రోజులపాటు శ్రీశైలంలో శ్రీస్వామివారి స్పర్శ దర్శనం నిలుపుదల జేశారు. భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిని ఇస్తున్నారు.  శ్రావణమాసం వరుస సెలవులు రావడంతో మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయ, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల జేశారు. అయితే  ఆలయంలో  హోమాలు, శ్రీస్వామి అమ్మవారి కళ్యాణం యధావిధిగా కొనసాగనునున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..