Dasara 2024: దుర్గాదేవి వాహనం సింహం ఎందుకో తెలుసా..! పురాణ కథ ఏమిటంటే

|

Sep 26, 2024 | 2:43 PM

శివుడి వాహనం నందీశ్వరుడు, గణేశుని వాహనం ఎలుక, కార్తికేయుడి వాహనం నెమలి, లక్ష్మిదేవి వాహనం గుడ్లగూబ, సరస్వతి దేవి వాహనం హంస, దుర్గాదేవి వాహనం సింహం. అయితే దేవీ నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది వేర్వేరు రూపాల్లో పుజిస్తారు. ఆయా అవతారాలుకు సంబందించిన శక్తి స్వరూపిణి వేర్వేరు వాహనాలతో దర్శనం ఇస్తుంది. శైలపుత్రి అమ్మవారు ఎద్దు వాహనంగా, గాడిద కాళరాత్రి వాహనంగా భావించి పుజిస్తారు. అయినప్పటికీ దుర్గాదేవి ప్రధాన వాహనం సింహం. అయితే దుర్గాదేవి సింహం వాహనం ఎందుకో ఈ రోజు తెలుసుకుందాం.. 

Dasara 2024: దుర్గాదేవి వాహనం సింహం ఎందుకో తెలుసా..! పురాణ కథ ఏమిటంటే
Goddess Durga
Follow us on

హిందువులు ఆరాధించే దేవుళ్ళలో దుర్గాదేవి ప్రధాన దైవం. శక్తిస్వరూపిణిగా భావించి పుజిస్తారు. దేవీ మహాత్మ్యం పురాణం ప్రకారం జగన్మాత మహాలక్ష్మి దేవి మహిషాసుర అనే రాక్షస సహారం కోసం దుర్గాదేవి అవతారం ఎత్తింది. హిందూ పురాణాల ప్రకారం దాదాపు అన్ని హిందూ దేవుళ్లకు వాహనం ఉంది. మహావిష్ణువు వాహనం గరుత్మంతుడు, శివుడి వాహనం నందీశ్వరుడు, గణేశుని వాహనం ఎలుక, కార్తికేయుడి వాహనం నెమలి, లక్ష్మిదేవి వాహనం గుడ్లగూబ, సరస్వతి దేవి వాహనం హంస, దుర్గాదేవి వాహనం సింహం. అయితే దేవీ నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది వేర్వేరు రూపాల్లో పుజిస్తారు. ఆయా అవతారాలుకు సంబందించిన శక్తి స్వరూపిణి వేర్వేరు వాహనాలతో దర్శనం ఇస్తుంది. శైలపుత్రి అమ్మవారు ఎద్దు వాహనంగా, గాడిద కాళరాత్రి వాహనంగా భావించి పుజిస్తారు. అయినప్పటికీ దుర్గాదేవి ప్రధాన వాహనం సింహం. అయితే దుర్గాదేవి సింహం వాహనం ఎందుకో ఈ రోజు తెలుసుకుందాం..

పార్వతి దేవి కొడుకు కార్తీకేయుడు పేరు స్కందుడు అందుకే పార్వతిదేవిని స్కందమాత అని పిలుస్తారు. కాత్యాయని దేవి వాహనం కూడా సింహం.. కూష్మాండ దేవికి పులి వాహనం కాగా.. చంద్రజంతి దేవి వాహనం కూడా పులి. కూష్మాండ దేవి, స్కందమాత, కాత్యాయని అమ్మవార్లది కూడా సింహం వాహనం. సిద్ధిదాత్రి పద్మం మీద కుర్చుని భక్తులతో పూజలను అందుకుంటుంది.

పురాణాల ప్రకారం శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి వేల సంవత్సరాలు తపస్సు చేసింది. తపస్సు కారణంగా పార్వతి దేవి చీకటిలో కలిసిపోయింది. పెళ్లయిన ఒకరోజు తర్వాత శివుడు పార్వతిని కాళి అని సంబోధించినప్పుడు… పార్వతి దేవి కైలాసాన్ని విడిచిపెట్టి, మళ్లీ తపస్సు చేసింది. ఆ సమయంలో ఆకలితో ఉన్న సింహం అటుగా వచ్చి తపస్సు చేస్తున్న పర్వతిదేవిని వేటాడాలని అనుకుని.. పార్వతిదేవి వైపు వెళ్ళింది. అయితే అక్కడ తపస్సులో మునిగి ఉన్న దేవిని చూసి మౌనంగా ఆమె ముందు సింహం కూర్చుంది.

ఇవి కూడా చదవండి

దేవి తపస్సు ముగించి మేల్కొన్నప్పుడు తాను ఆమెని ఆహారంగా తీసుకోవాలని పార్వతీదేవి ఎదురుగా సింహం కుర్చుని ఉంది. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా సింహం తాను కూర్చున్న చోట నుంచి కదలలేదు. ఇంట్లో పార్వతీ దేవి తపస్సుని మెచ్చిన మహాదేవుడు ప్రత్యక్షమై పార్వతిని గౌవర్ణగా అభివర్ణించాడు. అప్పుడు పార్వతీ దేవి గంగాస్నానం చేయగా ఒక చీకటి దేవత ప్రత్యక్షమైంది. అమ్మావరి ఈ రూపాన్ని కాళరాత్రి అని అంటారు. పార్వతీదేవిని వేటాడి తినేందుకు వచ్చిన సింహాన్ని తన వాహనంగా మార్చుకుంది. ఎందుకంటే సింహం పార్వతి దేవి కళ్ళు తెరవడం కోసం అనేక సంవత్సరాలు వేచి చూసింది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి