CM KCR: అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తిపీఠమైన కొల్హాపూర్ (Kolhapur ) శ్రీ మహాలక్ష్మీ ( Sri Mahalakshmi Temple) అంబాబాయి అమ్మవారిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు. అమ్మవారికి సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలను చేశారు. దర్శనానంతరం సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనం అందించారు. అమ్మవారిని దర్శించుకోవడం కోసం గురువారం ఉదయం మహారాష్ట్రలోని కొల్హాపూర్ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా విమానంలో కొల్హాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్, మధ్యాహ్నం కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మీ అంబాబాయి ఆలయానికి చేరుకోగా, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో కార్వీర్ నివాసిని శ్రీ మహాలక్ష్మి అంబాబాయి అలంకార పూజలో సీఎం కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తిరిగి కుటుంబ సమేతంగా హైదరాబాద్ చేరుకోనున్నారు.
Also Read:
Amritha aiyer: పట్టుపరికిణిలో మెరిసే చందమామలా ఒంపు సొంపులతో అమృత అయ్యర్…(ఫొటోస్)