భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం ఉదయం ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలాన్ని దర్శించనున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శుక్రవారం శ్రీశైలం రానున్నారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి రహదారి మార్గంలో బయలుదేరారు. సరిగ్గా ఉదయం 8.45 గంటలకు దేవస్థానం అతిథిగృహానికి చేరుకుంటారు.
అనంతరం ఆలయ మర్యాదలు స్వీకరించి స్వామి, అమ్మవార్లను దర్శంచుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దర్శనం అనంతరం రమణ దంపతులు తిరిగి రూ.10.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన సందర్భంగా శ్రీశైలం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇటివలే తిరుమల శ్రీవారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు.అలాగే యదాద్రిని దర్శించుకున్నారు.