Kedarnaths Temple: కేదార్‌నాథ్ తలుపులు మూసివేత.. బోలేనాథ్ కు వచ్చే 6 నెలల పాటు ఉఖిమఠ్‌లో పూజలు

|

Oct 27, 2022 | 10:03 AM

ఆర్మీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో శివయ్య పంచముఖీ దేవత విగ్రహం శ్రీ ఓంకారేశ్వరాలయం, ఉఖీమఠ్ కు తీసుకుని వచ్చారు. జై బోలో శంకర్ అంటూ నినాదాలతో వేలాది మంది భక్తులు డోలీతో స్వామివారి వెంట నడిచారు.

Kedarnaths Temple: కేదార్‌నాథ్ తలుపులు మూసివేత.. బోలేనాథ్ కు వచ్చే 6 నెలల పాటు ఉఖిమఠ్‌లో పూజలు
Kedarnath Temple
Follow us on

ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర ముగిసింది. నేడు కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మూసివేశారు. శీతాకాలం సందర్భంగా మంచుతో ఆలయం కప్పబడి ఉండనుంది. దీంతో ఉదయం పూజా కార్యక్రమాలను నిర్వహించి తలుపులు మూసివేసిన తరువాత.. ఆర్మీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో శివయ్య పంచముఖీ దేవత విగ్రహం శ్రీ ఓంకారేశ్వరాలయం, ఉఖీమఠ్ కు తీసుకుని వచ్చారు. జై బోలో శంకర్ అంటూ నినాదాలతో వేలాది మంది భక్తులు డోలీతో స్వామివారి వెంట నడిచారు. ఇప్పుడు వచ్చే 6 నెలల పాటు ఉఖిమఠ్‌లో పూజలు నిర్వహించనున్నారు.

ఉత్తరకాశీలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యమునోత్రి ధామ్ తలుపులు కూడా నేటి నుంచి మూతబడనున్నాయి. ఈరోజు భయ్యా దూజ్ సందర్భంగా యమునోత్రి తలుపులు వచ్చే ఆరు నెలల పాటు మూసివేయబడతాయి. ఈ మేరకు పూజారులు తలుపుల మూసివేతకు సన్నాహాలను చేస్తున్నారు. యమునా దేవి గుడి తలుపులు ఈరోజు మధ్యాహ్నం 12.09 గంటలకు అభిజిత్ ముహూర్తంలో సర్వన్ సిద్ధి యోగం కింద మూసివేయనున్నారు. శని మహారాజ్ నేతృత్వంలోని యమునా దేవి ఈ రోజు యమునోత్రి ధామ్ నుండి బయలుదేరి.. శీతాకాల విడిది స్థలం అయిన ఖర్సాలీ గ్రామానికి వెళ్లనున్నది.

ఇవి కూడా చదవండి

దీనితో పాటు నవంబర్ 18 శుక్రవారం రెండవ కేదార మద్మహేశ్వర, నవంబర్ 7 న మూడవ కేదార తుంగనాథ్ తలుపులు మూసివేయబడతాయి. చార్ ధామ్  యాత్ర మే 3, 2022న అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమైంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 42 లక్షల మంది యాత్రికులు చార్ ధామ్  యాత్రకు చేరుకున్నారు.

గంగోత్రి ధామ్ తలుపులు కూడా మూసివేత:
ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన గర్వాల్ హిమాలయ ప్రాంతంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులు బుధవారం అన్నకూట్ సందర్భంగా  మూసివేయబడ్డాయి. చలికాలంలో ఆరు నెలల పాటు ఆలయాన్ని మూసివేసే సమయంలో.. భక్తులు ముఖ్బా గ్రామంలోని గంగామాతను ఆరాధిస్తారు.

నవంబర్ 19న బద్రీనాథ్ తలుపులు మూసివేయనున్నారు. హిమపాతం, శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా, ప్రతి సంవత్సరం అక్టోబర్-నవంబర్లలో  చార్ ధామ్ లు మూసివేయబడతాయి. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో తిరిగి తెరవబవనున్నారు.

ఈసారి రికార్డు స్థాయిలోభక్తులు:
గర్వాల్ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావించే చార్ధామ్ యాత్రకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. కోవిడ్ నిషేధం కారణంగా  రెండేళ్ల తర్వాత సాగిన సాధారణ చార్‌ధామ్ యాత్రలో..  ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు చేరుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 24 వరకు చార్ ధామ్ యాత్రకు  43 లక్షల 9 వేల 634 మంది యాత్రికులు వచ్చారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..